Indian Railways: దేశంలో అత్యాధునిక రైలు అనగానే, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గుర్తుకు వస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం 160 కిలో మీటర్లు ఉంటుంది. అయితే, దేశంలో 100 కిలో మీటర్లకు మించి వేగంతో ప్రయాణించే రైళ్లు చాలా ఉన్నాయి. వాటిలో 10 రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయా రైళ్ల గరిష్ట వేగం, ప్రయాణీకులకు అందించే సౌకర్యాలు, ఫీచర్లు సహా అన్ని వివరాలను పరిశీలిద్దాం..
దేశంలోని టాప్ 10 వేగవంతమైన రైళ్లు
⦿ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) – 180 km/h
ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఇది. 2019లో ప్రారంభమైంది. గరిష్ట వేగం 180 km/h. దేశ వ్యాప్తంగా 135కు పైగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలు వై-ఫై, ఆటోమేటిక్ డోర్స్, GPS సమాచార వ్యవస్థలు ఉన్నాయి.
⦿ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ (Gatimaan Express) – 160 km/h
న్యూ ఢిల్లీ-ఆగ్రా మధ్య నడిచే ఈ రైలు.. దేశంలో మొట్ట మొదటి సెమీ-హైస్పీడ్ రైలు. 188 కి. మీ దూరాన్ని 1 గంట 40 నిమిషాల్లో చేరుకుంటుంది. ట్రైన్ హోస్టెస్ సేవలు, వై-ఫై, బయో-టాయిలెట్లు ఈ రైల్లో ఉన్నాయి.
⦿ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (New Delhi-Bhopal Shatabdi Express) – 150 km/h
ఢిల్లీ-భోపాల్ మధ్య ఈ రైలు నడుస్తుంది. మొత్తం 707 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు ఆగ్రా, గ్వాలియర్ నగరాలను కలుపుతుంది. సౌకర్యవంతమైన సీటింగ్, భోజన సౌకర్యాలను అందిస్తుంది.
⦿ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Mumbai-New Delhi Rajdhani Express) – 140 km/h
ముంబై-న్యూ ఢిల్లీతో పాటు పలు మార్గాల్లో మధ్య ఈ రైలు నడుస్తుంది. 1,384 కిమీ దూరాన్ని 15 గంటల 50 నిమిషాల్లో చేరుకుంటుంది. ఇది పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైలు, భోజనం, వై-ఫై సౌకర్యాలు ఉన్నాయి.
⦿ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (New Delhi-Kanpur Shatabdi Express) – 140 km/h
ఈ రైలు ఢిల్లీ-కాన్పూర్ మధ్య నడుస్తుంది. వేగవంతమైన ప్రయాణం కోసం తక్కువ స్టాప్ లతో రూపొందించబడింది.
⦿ తేజస్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express) – 135 km/h
ఈ రైలు 135 కిలో మీటర్ల గరిష్ట వేగానాన్ని కలిగి ఉంటుంది. 110 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ముంబై నుంచి గోవా వరకు ప్రయాణం చేస్తుంది. స్మార్ట్ ఫీచర్లు- వినోద వ్యవస్థను కలిగి ఉంటుంది.
⦿ దురంతో ఎక్స్‌ప్రెస్ (New Delhi-Sealdah Duronto Express) – 135 km/h
ఈ రైలు 135 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. 110 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ఢిల్లీ-కోల్‌కతా మధ్య 1,457 కిమీ దూరాన్ని నాన్-స్టాప్ గా చేరుకుంటుంది. కర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
⦿ కవి గురు ఎక్స్‌ప్రెస్(Kavi Guru Express)- 130 km/h
ఈ రైలు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణంగా 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముఖ్యమైన నగరాలను కలుపుతుంది.
⦿ ఉదయ్ ఎక్స్‌ప్రెస్( Uday Express)- 130 km/k
ఈ రైలు సాధారణంగా 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణంగా 85-95 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
⦿ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్– 130 km/k
ఈ రైలు ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. 130 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. 491 కిమీ దూరాన్ని కవర్ చేస్తూ, రెండు అంతస్తుల ఎయిర్-కండిషన్డ్ కోచ్‌లతో నడుస్తుంది.
Read Also: రైలులోనే రెస్టారెంట్.. ఎక్కడో కాదు ఇండియాలోనే.. మీకూ అలా జర్నీ చేయాలని ఉందా?