BigTV English

Mysore Tourist Places: మైసూర్‌ వెళ్తున్నారా ? చూడాల్సిన బెస్ట్ ప్లేస్‌‌లు ఇవే

Mysore Tourist Places: మైసూర్‌ వెళ్తున్నారా ? చూడాల్సిన బెస్ట్ ప్లేస్‌‌లు ఇవే

Mysore Tourist Places: మైసూర్‌ను రాజభవనాల నగరంగా పిలుస్తారు. కర్ణాటకలో ఉండే మైసూర్ చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా గొప్ప నగరం అని చెప్పవచ్చు. ఇక్కడి భవనాల నిర్మాణం, అందమైన తోటలు, సాంప్రదాయ కళలు రాజుల వారసత్వానికి ప్రసిద్ధి చెందినవి. మైసూర్ దసరా పండుగకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ దసరా పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో మైసూర్ ప్యాలెస్ మెరిసే లైట్ల వెలుగులో చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ నగరం ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.


మైసూర్‌లో చూడటానికి అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి పురాతన దేవాలయాలు, రాజభవనాలు, అందమైన సరస్సులు, పచ్చని తోటలు, వన్యప్రాణుల అభయారణ్యాలు దీనిని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చేసాయి. మీకు చారిత్రక కట్టడాలను చూడటం ఇష్టమైనా లేదా మీరు ప్రకృతి ప్రేమికులైనా కూడా మైసూర్‌ మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఈ ప్రాంతంలోని గొప్ప సంస్కృతి , ప్రశాంతమైన వాతావరణం దీనిని దక్షిణ భారతదేశంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిపింది.

మైసూర్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు:


మైసూర్ ప్యాలెస్:
మైసూర్ నగరంలోని ప్రధాన ఆకర్షణ ప్యాలెస్. దీనిని వడియార్ రాజవంశానికి చెందిన వారు నిర్మించారు. ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణం, అందమైన శిల్పాలు , రాత్రిపూట మెరిసే లైట్లు ప్యాలెస్ అందాన్ని మరింత పెంచుతాయి. దసరా సమయంలో ఈ భవనం చాలా అందంగా కనిపిస్తుంటుంది.

చాముండి కొండలు:
ఈ కొండ మైసూర్ నగరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ చాముండేశ్వరి దేవికి చెందిన ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి 1,000 మెట్లు ఉంటాయి. ఇక్కడి నుండి మొత్తం మైసూర్ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.

బృందావన్ గార్డెన్స్:
కృష్ణరాజ సాగర్ ఆనకట్ట సమీపంలో ఉన్న బృందావన్ గార్డెన్ లో మ్యూజికల్ ఫౌంటెన్లు , పచ్చటి చెట్లు , రకరకాల మొక్కలు ఉంటాయి. సాయంత్రం వెలుగుల్లో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ, కపుల్స్ ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్

శ్రీరంగపట్నం:
టిప్పు సుల్తాన్ రాజధానిగా శ్రీరంగపట్నం ఉండేది. టిప్పు సుల్తాన్ రాజభవనం, దరియా దౌలత్ బాగ్ , శ్రీ రంగనాథస్వామి ఆలయం ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడ ఉన్న ఆలయాలు చూపరులను ఆకట్టుకుంటాయి. వీటి కళా సౌందర్యం అంత గొప్పగా ఉంటుంది.

మైసూర్ జూ:
శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ గా ప్రసిద్ధి చెందిన మైసూర్ లోని ఈ జూ భారతదేశంలోని పురాతనమైన జూలలో ఒకటి. ఇక్కడ అనేక అరుదైన జంతువులు, పక్షులను మనం చూడవచ్చు.ఇది వన్యప్రాణుల ప్రేమికులకు ఇష్టపడే మరో బెస్ట్ ప్లేస్ .

Also Read: ఆహారం సరిగ్గా నమలకుండా తింటున్నారా ?

జగన్మోహన్ ప్యాలెస్ & ఆర్ట్ గ్యాలరీ:
ఇది రాజా రవివర్మ, ఇతర ప్రసిద్ధ కళాకారుల చిత్రాలను ప్రదర్శించే అద్భుతమైన ప్యాలెస్, ఆర్ట్ గ్యాలరీ. ఈ ప్యాలెస్ చాలా బాగుంటుంది. మైసూర్ లో తప్పకుండా చూడాల్సిన ప్యాలెస్ ఇది.

KRS ఆనకట్ట (కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట):
కావేరి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అని చెప్పవచ్చు. ఇక్కడ నుండి చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను చూడవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×