ఫ్రాన్స్ రాజధాని పారిస్ బాంబు భయంతో వణికిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం కావడంతో జనాల వెన్నులో వణుకు మొదలయ్యింది. తాజాగా పారిస్ లోని గారే డు నార్డ్ స్టేషన్ సమీపంలో సెకెండ్ వరల్డ్ వార్ కు సంబంధించి బాంబు బయటపడింది. రైల్వే కార్మికులు రైలు పట్టాల దగ్గర మెయింటెనెన్స్ పనులు ఈ బాంబును గుర్తించారు. వెంటనేఈ విషయాన్ని రైల్వే అధికారులు చెప్పడంతో అలర్ట్ అయ్యారు. ఈ స్టేషన్ నుంచి వెళ్లే అన్ని రైళ్లను నిలిపివేశారు. పోలీసుల నుంచి నెక్ట్స్ ఆదేశాలు వచ్చే వరకు ఈ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు తమ ప్రయాణాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
బాంబును నిర్వీర్యం చేసిన భద్రతా సిబ్బంది!
అరుదైన బాంబు గుర్తించడంతో స్థానిక మెట్రో లైన్లు, కమ్యూటర్ లైన్లు యూరోస్టార్ సర్వీసులతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. “పారిస్ గారే డు నార్డ్ సమీపంలో చేపట్టిన పనుల సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు కార్మికులు గుర్తించారు. రైల్వే స్టేషన్ నుండి 2.5 కి.మీ దూరంలో రైలు పట్టాల మధ్యలో బాంబు కనుకొనబడింది. మందుపాతర తొలగింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు రైల్వే స్టేషన్ నుంచి అన్ని రకాల రైల్వే సర్వీసులను నిలిపివేయడం జరిగింది” అని ఆ దేశ రైల్వే నెట్ వర్క్ వెల్లడించింది. అటు ఈ బాంబును నిర్వీర్యం చేసిన భద్రతా సిబ్బంది.. దాని మెకానిజాన్ని పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించి బాంబుగా గుర్తించారు.
Not a good day for @Eurostar passengers as all services between London & Paris suspended until at least midday due to an unexploded WW2 bomb found near tracks in Paris. Live train info here 👇https://t.co/R1E9SGZIRa pic.twitter.com/fVgeVsR6wI
— Rob Staines Travel Expert 🏳️🌈 (@RobTravelExpert) March 7, 2025
Read Also: గంటకు 400 కిలో మీటర్ల వేగం.. చైనా ఫాస్టెస్ట్ ట్రైన్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!
యూరప్ కు కీలక రవాణ కేంద్రం
గారే డు నార్డ్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. యూరప్ రైల్వే రవాణాకు కీలక కేంద్రంగా ఉంది. ఇది ఫ్రాన్స్ కు నార్త్ లో ఉన్న అంతర్జాతీయ ప్రాంతాలకు ప్రయాణ సేవలను అందిస్తుంది. ఫ్రాన్స్, లండన్, బెల్జియం, నెదర్లాండ్స్ కు ఇక్కడి నుంచి రైల్వే సర్వీసులు నడుస్తాయి. అంతేకాదు, పారిస్ లోని మెయిన్ ఎయిర్ పోర్టుతో పాటు అనేక ప్రాంతీయ రైల్వే సర్వీసులు ఇక్కడి నుంచే కొనసాగుతాయి. ఫ్రాన్స్ చుట్టూ రెండు ప్రపంచ యుద్ధాలకు సంబంధించి బాంబులు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ, అత్యంత రద్దీగా ఉండే గారే డు నార్డ్ రైల్వే స్టేషన్ సమీపంలో తొలిసారి బాంబు కనిపించడంతో అందరూ భయంతో వణికిపోయారు. పారిస్ తో పాటు ఫ్రాన్స్ ప్రజలంతా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పారిస్ లో సుమారు 7 లక్షల మంది జీవిస్తున్నారు. అటు ఈ బాంబు గురించి భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు ఫ్రాన్స్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ వెల్లడించారు.
Read Also: ఆ అందమైన ఐలాండ్‌లో సిటిజన్‌షిప్ కావాలా? జస్ట్ రూ. 91 లక్షలు చెల్లిస్తే చాలట!