Travel Tips For Family: వేసవి సెలవులు రాగానే చాలా మంది ట్రిప్ వెళ్లాలని నిపిస్తుంటుంది. అది పర్వతాల చల్లని లోయలు అయినా లేదా సముద్ర తీరం అయినా, కానీ ప్రయాణ ప్రణాళిక పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ సరదా సమయంలోనూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. సెలవుల ఆనందమంతా చెడిపోతుంది. వేసవిలో.. ముఖ్యంగా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు, డీహైడ్రేషన్, వడదెబ్బ , ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు సర్వసాధారణం అవుతాయి.
ప్రయాణం ముఖ్యం.. కానీ దానికంటే ముఖ్యం ఏమిటంటే ఫిట్‌గా , యాక్టివ్‌గా ఉండటం. తద్వారా మీరు ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. కొన్ని సింపుల్, ప్రభావ వంతమైన జాగ్రత్తలు దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మిమ్మల్ని అనారోగ్యానికి గురి కాకుండా కాపాడతాయి. వేసవి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్:
వేసవిలో అత్యంత సాధారణమైన, తీవ్రమైన సమస్య డీహైడ్రేషన్. ఎక్కువగా ప్రయాణించడం.. ఎండలో ఉండటం వల్ల శరీరంలోని నీటి శాతం త్వరగా తొలగిపోతుంది. అందుకే.. రోజంతా కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. మీరు ఎక్కడికి వెళ్లినా మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ వంటి హైడ్రేటింగ్ డ్రింక్స్ కూడా మీకు ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
తేలికైన, శుభ్రమైన ఆహారం:
ప్రయాణం చేసే సమయంలో బయట తినడం సర్వసాధారణం. కానీ వేసవిలో వేయించిన ఆహారం తినడం మీ ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి సమయంలో తేలికైన, తాజా, తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ఫుడ్ పాయిజనింగ్ నివారించడానికి.. ఎల్లప్పుడూ శుభ్రమైన, విశ్వసనీయ ప్రదేశం నుండి ఆహారాన్ని కొని తినండి. అంతే కాకుండా ఈ సమయంలో పండ్లు, సలాడ్లు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది.
Also Read: సమ్మర్‌లో ఈ ప్లేస్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గదామం
సన్‌స్క్రీన్, సన్‌ప్రొటెక్షన్ తప్పనిసరి:
ఎండలో ఎక్కువగా నడవడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఇది హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. శరీర వేడి నుండి ఉపశమనం పొందడానికి టోపీ, సన్ గ్లాసెస్, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి.
నిద్ర, విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు:
ప్రయాణాల హడావిడిలో.. తరచుగా నిద్రను అంతగా పట్టించుకోరు. కానీ తగినంత నిద్ర పోకపోవడం వల్ల అలసట, చిరాకు, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీరం ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 6-7 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
కొన్ని రకాల మందులు:
ప్రయాణ సమయంలో చిన్న గాయం, అలెర్జీ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, నొప్పి పెయిన్ కిల్లర్స్, ORS, బ్యాండ్-ఎయిడ్, డెట్టాల్, క్రిమినాశక క్రీమ్ , ఇతర ముఖ్యమైన మందులు మీ దగ్గర ఉంచుకోండి.