Health Benefits: అందరు అనుకుంటారు ఇదేంటీ ఆహారం త్రాగండి.. నీళ్లు తినండి అని ఉంది.. కానీ ఇది నిజం మన పూర్వీకుల నుంచి ఇప్పటి శాస్త్రవేత్తల వరకు చెబుతున్న ఫార్మాలా అది. ఈ కాలంలో ఏ అనారోగ్యం లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి మించిన అదృష్టం లేదు. అయితే మన శరీరంలో మన ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపించే భాగం ఏదైనా ఉంది అంటే అది జీర్ణవ్యవస్థ. అయితే దీని గురించి వివరాల్లోకి వెళితే..
1. ఆహారం త్రాగండి:
మన జీర్ణవ్యవస్థ మన కడుపులో కాదు, మన నోటి నుండే మొదలవుతుంది. కానీ చాలా మంది నోటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. చాలా మంది అన్నం నోట్లో పెట్టుకుని నమలకుండానే మింగేస్తారు అది మంచిది కాదు. అందుకే మన పెద్దలు కనీసం ఆహారం 32 సార్లు నమలాలి అని చెబుతారు. అంటే నోట్లో ఆహారం నీరులా మారే వరకు నమలి అప్పుడు మింగాలి. దీన్నే ఆహారం త్రాగడం అంటారు. మన నోట్లో ఉన్న లాలాజలంకు చాలా పవరు ఉంటుంది. మన శరీరంలో ఉండే కొన్ని జబ్బులకు ఈ లాలజలం ద్వారానే మేడిసన్ తయారువుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది పెయిన్ కిల్లర్ లాగా కూడా పని చేస్తుంది.
ఎందుకు ఇది ముఖ్యం?
జీర్ణక్రియ సులభతరం: ఆహారాన్ని బాగా నమలడం వల్ల అది చిన్న ముక్కలుగా విడిపోతుంది, ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. లాలాజలంలోని ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి.
పోషకాల శోషణ: బాగా నమిలిన ఆహారం నుండి శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.
అతిగా తినడం నివారణ: నెమ్మదిగా తినడం వల్ల ఆకలి హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు: ఇది గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
ముఖ్యంగా ఆహారం తినేటప్పుడు హడావిడి చేయకండి, నెమ్మదిగా, శాంతంగా తినండి.
టీవీ లేదా మొబైల్‌ను చూస్తూ తినడం మానేయండి, ఇది ఆహారం యొక్క రుచి మరియు ఆనందాన్ని పెంచుతుంది.
2. నీళ్లు తినండి
నీటిని తినడం.. అంటే ఒకేసారి నీటిని గడగడ తాగేయకుండా కొద్ది కొద్దిగా నీటిని సిప్ చేస్తూ కొంత సేపు వాటిని నోటిలోనే ఉండనీయాలి. అప్పుడు లాలాజలం(సైలైవ) నీటలో భాగా మిక్స్ అయి లోపలికి వెళుతుంది. దీని వలన కడుపులోని యాసిడ్స్ న్యూట్రిలైజ్ అవుతాయి. అలాగే మనం తాగే నీరు కూడా బాగా కూలింగ్ ఉండకూడదు, బాగా వేడిగా ఉండకూడదు.. నార్మల్‌గా ఉండాలి. అలాగే ముఖ్యంగా రాత్రి సమయంలో తినడానికి, పడుకోవడానికి మధ్య కనీసం మూడు గంటల గ్యాప్ ఉండాలి.
ఎందుకు ఇది ముఖ్యం?
హైడ్రేషన్: శరీరంలో 60-70% నీరు ఉంటుంది, ఇది శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, విష పదార్థాల బహిష్కరణకు సహాయపడుతుంది.
మెటబాలిజం: నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఇది కేలరీల బర్నింగ్‌కు సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం: తగినంత నీరు తాగడం చర్మాన్ని తేమగా ఉంచుతుంది, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
కిడ్నీ ఆరోగ్యం: నీరు మూత్రపిండాల నుండి విష పదార్థాలను తొలగిస్తుంది, మూత్రపిండంలోని రాళ్ల ఏర్పాటును నివారిస్తుంది.
ఆచరణ సలహాలు:
రోజుకు 2-3 లీటర్ల నీరు తాగండి ఒకేసారి ఎక్కువ నీరు తాగకుండా, చిన్న సిప్‌లలో తాగండి.
ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం జీర్ణక్రియకు మంచిది.
నీటిలో నిమ్మరసం లేదా పుదీనా ఆకులు కలపడం రుచిని పెంచుతుంది.
3. ఆరోగ్యంగా ఉండడానికి వీటిని పాటించండి:
ఆహారం, నీటి వినియోగంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కేవలం ఆహారం, నీరు మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్య అలవాట్లను కూడా పాటించమని చెబుతుంది.
Also Read: వేసవి వేడిని తగ్గించే నన్నారి షర్బత్ గురించి తెలుసా?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సలహాలు:
సమతుల ఆహారం: ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి.
నిద్ర: రోజుకు 7-8 గంటల నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం.
మానసిక ఆరోగ్యం: ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యానం, యోగా, లేదా హాబీలను అలవాటు చేసుకోండి.
చెడు అలవాట్లను వదిలేయండి: ధూమపానం, మద్యపానం, మరియు అధిక చక్కెర లేదా ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించండి. దీంతో మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుంది.