IND vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ( Australia ) ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభం అయిన నిన్నటి… ఇవాల్టి వరకు టీమిండియా పై..స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది ఆస్ట్రేలియా జట్టు. ఈ తరుణంలోనే మొదటి ఇన్నింగ్స్ లో 157 పరుగుల లీడ్ సంపాదించింది ఆస్ట్రేలియా జట్టు ( Australia ). ఇక ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ( Australia )… 337 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ తరుణంలోని 157 పరుగుల అధిక్యాన్ని సంపాదించింది ఆస్ట్రేలియా.
Also Read: IPL 2025: RCB లో ప్రకంపనలు..ఆ ప్లేయర్ రిటైర్మెంట్.. ఒంటరైన విరాట్ కోహ్లీ ?
ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు ( Australia ) లో… డేంజర్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో… ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. హెడ్ తో పాటు మిగతా బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించారు.ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లలో… ఓపెనర్ కవాజా 13 పరుగులకే అవుట్ అయ్యాడు. అటు మెక్స్విని 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.మూడవ వికెట్ కు బరిలోకి దిగిన లేబుసేన్ 64 పరుగులతో దుమ్ము లేపాడు. అయితే ఐదో వికెట్ కు దిగిన హెడ్… 141 బంతుల్లో 140 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు 17 ఫోర్లు ఉన్నాయి.
అయితే చివరి వరకు ఆడిన హెడ్ను… మహమ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించాడు. తన అద్భుతమైన డెలివరీతో బోల్డ్ చేశాడు సిరాజ్. దీంతో ఆస్ట్రేలియా జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ ను 337 పరుగుల వద్ద ముగించేసింది. ఇక టీం ఇండియా బౌలర్లలో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తో పాటు వైస్ కెప్టెన్ బూమ్రా అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో టీమిండియా వైస్ కెప్టెన్ బుమ్రా ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!
అటు మహమ్మద్ సిరాజ్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టడం జరిగింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించకపోయిన సిరాజ్… ఈ మ్యాచ్లో మాత్రం నాలుగు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అటు నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టగా… రవిచంద్రన్ అశ్విన్ మరొక వికెట్ పడగొట్టి.. రాణించారు.
అయితే మరో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రా నాకు ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా పడలేదు. 16 ఓవర్లు వేసిన హర్ష రానా 86 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేదు. అయితే అతను రెండవ ఇన్నింగ్స్ లో వికెట్ పడగొట్టే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 44.1 ఓవర్లు ఆడి… 108 పరుగులకు కుప్ప కూలింది.
మొదటి ఇన్నింగ్స్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. దారుణంగా విఫలమైంది. నితీష్ కుమార్ రెడ్డి తో పంత్ అలాగే కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ పెద్దగా… ఆడడం జరగలేదు. దీంతో మొదటి రోజు పూర్తి కాకముందే టీమిండియా 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది.