IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో లోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు.
Also Read: Jyoti Malhotra: బాబర్ ఆజంతో జ్యోతి మల్హోత్రాకు లింకులు.. అ**క్రమ సంబంధం పెట్టుకుని మరీ !
ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి లక్నోకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇవాల్టి మ్యాచ్ లో గెలిస్తేనే లక్నోకు ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. లేకపోతే ఇంటి దారి పట్టడమే. అయితే ఇవాల్టి మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిస్తే లక్నో ఇంటికి వెళుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే ముంబై ఇండియన్స్ మధ్య… ప్లే ఆఫ్ ఫైట్ ఉంటుంది. ఆ రెండు జట్లలో.. తమ తర్వాతి మ్యాచ్లు గెలిచిన జట్టు.. నేరుగా ప్లే ఆఫ్ కి వెళ్తుంది.
మూడు జట్లను వణికిస్తున్న హైదరాబాద్
ఇవాళ జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ గనక ఓడిపోతే.. ప్లే ఆఫ్ మరింత రసవత్తరంగా ఉంటుంది. లక్నో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే ముంబై ఇండియన్స్ కూడా బరిలో ఉంటాయి. ఈ మూడు జట్లల్లో… ఏ జట్టు ఎక్కువ మ్యాచ్ లు, మెరుగైన రన్ రేట్ కలిగి ఉంటే.. ఆ జట్టు ప్లే అప్ కి వెళుతుంది. కాబట్టి ఈ మూడు జట్లకు… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ చాలా కీలకం. ఇవాల్టి ఫలితం తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోతాయి..
ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న మూడు జట్లు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. నాలుగో స్థానానికి… ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే లక్నో పోటీ పడుతున్నాయి. ఇందులో ఏదో ఒక జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ కు వెళుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ముంబై ఇండియన్స్ కు ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఇక అటు ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.