Indin Railways: రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్స్ దొరకడం అందరికీ సాధ్యం కాదు. ఎంత త్వరగా టికెట్లు బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టులో ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్ వెబ్ సైట్‌లు ఇక్సిగో, రెడ్ బస్, మేక్ మైట్రిప్ ‘టికెట్ కన్ఫర్మేషన్ అష్యూరెన్స్’ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ఫీచర్ ద్వారా టికెట్స్ కొనుగోలు చేసిన వారికి.. ఒకవేల కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు మనీ-బ్యాక్ గ్యారెంటీని అందిస్తుంది.
ఇంతకీ ఏంటీ ‘కన్ఫర్మేషన్ అష్యూరెన్స్’?
తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్ వెయిట్ లిస్ట్ చేయబడిన రైలు టికెట్లను బుక్ చేసుకునే వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయాణీకులు టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ నిబంధనలను బట్టి ఒకళ వేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే టికెట్ ధర కంటే 3 రెట్లు ఎక్కువ వాపసు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ గ్యారెంటీ లేని రైలు టికెట్ బుకింగ్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలా పని చేస్తుంది. ఒకవేళ చార్ట్ తయారయ్యే సమయానికి టికెట్స్ కన్ఫర్మ కాకపోతే, ప్రత్యామ్నాయ క్ఫన్ఫర్మ్ ట్రైన్, బస్ టికెట్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. లేదంటే, మీ టికెట్ కోసం మీరు చెల్లించిన ఖర్చుకు మూడు రెట్లు వరకు తిరిగి చెల్లిస్తాయి.ముఖ్యమైన బుకింగ్ యాప్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సాధారణంగా ఎలా పని చేస్తుందో చూద్దాం..
⦿ ఇక్సిగో: వెయిట్ లిస్ట్ చేయబడిన ప్రయాణీకులకు రైలు టికెట్ బుకింగ్ సమయంలో 2x, 3x మనీ-బ్యాక్ గ్యారెంటీ ఎంపికలను అందిస్తుంది. ఎంచుకున్న ఆప్షన్ బట్టి డబ్బులను రిటర్న్ ఇస్తుంది.
⦿ రెడ్ బస్: రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయ బస్సు టికెట్ ను ఆటో బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
⦿ మేక్ మై ట్రిప్: టికెట్ లభ్యత ఆధారంగా రీఫండ్ లేదంటే ప్రత్యామ్నాయ ప్రయాణం కోసం ఇతర అవకాశాలను కల్పిస్తుంది.
Read Also: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
ఈ ఫీచర్ ప్రయాణీకులకు ఎలా ఉపయోగపడుతుందంటే?
రైలు టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న సెలవులు, పండుగల సమయంలో వెయిట్ లిస్ట్ టికెట్స్ ప్రయాణీకులకు తలనొప్పిగా మారుతుంది. IRCTC ప్రకారం, ధృవీకరించబడని బుకింగ్‌ల కారణంగా వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీచర్ కారణంగా చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం, ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనుగోలు చేయడం లాంటి ఇబ్బందులను తప్పించే అవకాశం ఉంటుంది. ఒకవేళ టికెట్ లభించకపోయినా, రెండు నుంచి మూడు రెట్లు డబ్బులు వాపస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణం క్యాన్సిల్ అయినా డబ్బులు వచ్చాయనే హ్యాపీనెస్ కలుగుతుంది.
⦿ రీఫండ్, ప్రత్యామ్నాయ టికెట్ అనేది ఆయా ట్రావెల్ ప్లాట్ ఫారమ్ నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది.
Read Also: రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే, ఈ టిప్స్ ఫాలో అయిపోండి!