OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ఎప్పటినుంచో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భాష అర్థం కాకపోయినా వీటిని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు చాలా మంది ప్రేక్షకులు. యాక్షన్ సినిమాలైతే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి. యాక్షన్ సీన్స్ తో పాటూ, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ లవ్ స్టోరీ తల్లీ, కూతుర్ల మధ్య జరుగుతుంది. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (YouTube)
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Far North’. 2007లో విడుదలైన ఈ సినిమాకు అసిఫ్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇది మైట్‌లాండ్ రాసిన ‘True North’ అనే చిన్న కథ ఆధారంగా రూపొందింది. ఇందులో మిషెల్ యో (సైవా), మిషెల్ క్రుసియెక్ (అంజా), సీన్ బీన్ (లోకి) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆర్కిటిక్ టండ్రాలోని ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతంలో జరుగుతుంది. దీని అద్భుతమైన సినిమాటోగ్రఫీ (రోమన్ ఓసిన్), ఈరీ మ్యూజిక్ స్కోర్ (డారియో మరియానెల్లి), మిషెల్ యో అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. 1 గంట 29 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. Amazon Prime Video, Tubi TV, YouTube లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సైవా అనే అమ్మాయి పుట్టిన సమయంలో, ఒక షామన్ ఆమె జాతకం మంచిది కాదని, ఆమెను ఎవరు ప్రేమించినా వాళ్ళకు హాని తీసుకొస్తుందని చెప్తాడు. ఆ తరువాత సైవా పెద్దయ్యాక ఒక అబ్బాయి ప్రేమలో పడుతుంది. గిరిజన తెగ నుండి ఆమెను బహాహిష్కరించాలని తీర్మానం చేస్తారు. అప్పుడే ఈ తెగను సోవియట్ సైనికులు ఊచ కోత కోసి చంపుతారు. ఈ సమయంలో బాయ్ ఫ్రెండ్ ముందే, సైనికులు సైవాపై అఘాయిత్యం చేస్తారు. అక్కడే ఉండే ఆమె తల్లి అంజా, సైవాను కాపాడి తనతో తీసుకెళ్తుంది. ఇక సైవా, అంజా ఒక నిర్మానుష్య ప్రాంతంలో జీవిస్తూ, ఆహారం కోసం చిన్న జంతువులను వేటాడటం, రెయిన్‌డీర్‌లను చంపడం వంటివి చేస్తుంటారు.
ఒక రోజు, సైవా మంచులో గడ్డకట్టి చనిపోతున్న ఒక లోకి అనే సైనికుణ్ణి కనిపెడుతుంది. ఆమెకు గతంలో జరిగిన చేదు అనుభవంతో, అపరిచితుల పట్ల అపనమ్మకంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె అతన్ని తమ టెంట్‌కు తీసుకొచ్చి, అతని ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లోకి ఒక తప్పించుకున్న సైనికుడని, రష్యన్ సైనికులు ఇతని కోసం గాలిస్తున్నారని తెలుసుకుంటుంది. అతను కోలుకున్న తర్వాత ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అంజా, లోకి ప్రేమలో పడతారు. అయితే సైవా కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల చాలా దారుణాలు జరుగుతాయి. చివరికి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమవుతుంది ? సైవా బాయ్ ఫ్రెండ్ బతికే ఉంటాడా ? సైనికుల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : బ్రతికుండగానే కాల్చి చంపే గ్రామస్తులు… పగతో ఊరినే వల్లకాడుగా మార్చే అమ్మాయి