BigTV English

Boeing Dreamliner: డ్రీమ్‌లైనర్ విమానంలో టెన్షన్ .. ప్రయాణికుల వీడ్కోల లేఖలు, చివరకు ఆ విధంగా

Boeing Dreamliner: డ్రీమ్‌లైనర్ విమానంలో టెన్షన్ .. ప్రయాణికుల వీడ్కోల లేఖలు, చివరకు ఆ విధంగా

Boeing Dreamliner: అహ్మదాబాద్‌లో బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలకు కష్టాలు మొదలయ్యాయా? ఆ కంపెనీకి కొత్త టెన్షన్ మొదలైందా? తాజాగా మరో డ్రీమ్‌లైనర్‌లో ఈ భయానక పరిస్థితులు ఎదుర్కొందా? తమ పని అయిపోయిందని అందులో ప్రయాణికులు వీడ్కోలు లేఖలు సైతం రాశారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో 191 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగింది? ఎక్కడ అనే డీటేల్స్‌లోకి వెళ్తే..


జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ డ్రీమ్‌లైనర్-737 విమానం సోమవారం సాయంత్రం అంటే జూన్ 30న పెను ప్రమాదం నుంచి బయటపడింది. ట్రావెలింగ్ సమయంలో అకస్మాత్తుగా 36 వేల అడుగుల ఎత్తులో ఒక్కసారిగా 10 వేల అడుగుల ఎత్తుకు దిగినప్పుడు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే విమానం సిబ్బంది ప్రయాణికులను అలర్ట్ చేశారు.

భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లు ధరించారు. తమకు ఇవే చివరి క్షణాలు కావచ్చునని భయపడ్డారు. ఆ భయంలో వీడ్కోల లేఖలు రాశారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.  సోమవారం సాయంత్రం జూన్ 30న చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్‌పోర్టు నుంచి టోక్యోకు జపాన్ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్ డ్రీమ్‌లైనర్‌కి చెందిన విమానం బయలు దేరింది.


విమానం గాల్లోకి వెళ్తుండగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా 10 వేల అడుగుల దిగినప్పుడు తీవ్రమైన సాంకేతిక వైఫల్యాన్ని ఎదుర్కొంది. అప్రమత్తమైన పైలట్ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. ఆ సమయంలో విమానంలో దాదాపు 191 మంది ట్రావెలర్లు ఉన్నారు.వెంటనే విమానంలో ప్రయాణికులు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించారు. తమ పని అయిపోయిందని భావించారు.

ALSO READ: ఫ్రీగా విమానం జర్నీ, వారికి మాత్రమే

ఇవే అంతిమ ఘడియలని భావించారు. చాలామంది తమ ఫోన్ల ద్వారా బంధువులకు, ఆఫీసులకు వీడ్కోలు లేఖలు పెట్టారు. చివరకు విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించాడు పైలట్. అక్కడ రాత్రి 8. 50 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

విమానం దిగుతున్న సమయంలో దాని పీడన వ్యవస్థ అత్యవసర హెచ్చరికను ప్రేరేపించింది. కొన్ని సెకన్లలో వ్యవధిలో ఆక్సిజన్ మాస్క్‌లు పైకప్పు నుండి కింద పడిపోయాయి. నిద్రిస్తున్న ప్రయాణీకులు విమానంలో గందరగోళానికి గురయ్యారు. విమానం పని చేయదని, వెంటనే ఆక్సిజన్ మాస్క్ ధరించమని క్యూ సభ్యుడు అరిచాడని ప్రయాణికుడు గుర్తు చేశాడు.

తాము బ్రతకలేమనే భయంతో బంధువులకు వీడ్కోలు లేఖలు రాసినట్టు తెలిపాడు. జూన్ ప్రారంభంలో అహ్మదాబాద్‌లో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. గతవారం వియత్నాంలో ఆగి ఉన్న విమానాన్ని మరో డ్రీమ్‌లైనర్ ఢీకొట్టింది. ఈ రెండు ఘటన తర్వాత ఇప్పుడు జపాన్ ఎయిర్‌లైన్స్‌ డ్రీమ్ లైనర్ విమానం వంతైంది.

గతేడాది అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది. తయారీ కంపెనీ నాణ్యతపై పలు సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. ప్రస్తుతం జపాన్ విమానం వ్యవహారంపై దర్యాప్తు లోతుగా జరుగుతోంది.

 

Related News

Indian Railways: భవిష్యత్ రైలు ప్రయాణం ఇలాగేనా? ఫస్ట్ ప్రయోగంతోనే అదరగొట్టిన రైల్వే!

AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!

Condor Airlines plane: విమానంలో మంటలు.. పేలిన ఇంజిన్, 273 మంది ప్రయాణికులు

Diwali Tickets Sold out: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్, బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే..

India’s Fastest Train: దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Indian Railways: కార్గోపై రైల్వే స్పెషల్ ఫోకస్, గతిశక్తి రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×