Railway station yellow boards reason: మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు.. ప్లాట్‌ఫారమ్‌లపై పసుపు రంగు బోర్డులపై నలుపు అక్షరాలతో ఉన్న స్టేషన్ పేర్లను చూస్తుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ అయిన ఇండియన్ రైల్వే ఈ రంగుల కలయికను కేవలం అందం కోసం కాకుండా.. బలమైన సైన్స్ , భద్రతా కారణాల వల్ల ఎంపిక చేసింది. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే.. ఈ వ్యవస్థలో, రైళ్లు స్టేషన్‌లోకి ప్రవేశించేటప్పుడు లోకో పైలట్లకు, ప్రయాణికులకు గమ్యస్థానం ఈజీగా కనిపించేలా ఈ ప్రత్యేక డిజైన్ తోడ్పడుతుంది. అసలు ఈ పసుపు రంగు బోర్డుల వెనక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్ రహస్యం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.
రంగులన్నింటిలోనూ ‘పసుపు’ రంగుకు అత్యధిక వేవ్‌లెంత్ ఉంటుంది. అలాగే చీకటిలో, పొగమంచులో , లేదా వర్షం పడే సమయంలో కూడా పసుపు రంగు చాలా దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. లోకో పైలట్లు వేగంగా రైలును నడుపుతున్నప్పుడు, స్టేషన్ పేరును చాలా దూరం నుంచే ఈజీగా గుర్తించడానికి ఈ రంగు ఎంతగానో సహాయ పడుతుంది.
మన కన్ను పసుపు రంగును మిగతా రంగుల కంటే చాలా వేగంగా గ్రహిస్తుంది.అందుకే హైవేలపై బోర్డులు, స్కూల్ బస్సులు ,ట్రాఫిక్ సైన్‌లలో కూడా ఎక్కువగా పసుపు రంగునే ఉపయోగిస్తారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని గుర్తించడంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండటానికి ఈ రంగును ప్రమాణంగా తీసుకున్నారు.
పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నలుపు రంగు అక్షరాలు ఉండటం వల్ల విరుద్ధమైన ప్రభావం ఏర్పడుతుంది. దీని వల్ల పగటిపూట ఎండలో అయినా.. రాత్రి సమయంలో బ్రైట్ లైట్ల వెలుతురులో అయినా అక్షరాలు ఏమాత్రం బ్లర్ కాకుండా అత్యంత స్పష్టంగా చదవడానికి వీలుగా ఉంటాయి.
ప్రపంచంలో చాలా మంది ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించలేకపోవడం వంటి సమస్య ఉంటుంది. అయితే పసుపు, నలుపు రంగుల కలయికను కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవారు కూడా చాలా స్పష్టంగా గుర్తించగలరు. అందరికీ ఒకేలా కనిపించే ఏకైక స్టాండర్డ్ కలర్ కోడ్ ఇది.
మధ్యాహ్నం వేళల్లో.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇతర రంగుల బోర్డులపై కాంతి పరావర్తనం చెంది అక్షరాలు కనిపించవు. కానీ పసుపు రంగు బోర్డులపై సూర్యరశ్మి పడినప్పుడు అది చుట్టూ ఉన్న కాంతిని సమానంగా ప్రసరింప చేస్తుంది తప్ప, అక్షరాలను బ్లర్ కానివ్వదు.
Also Read: 750+ సిబిల్ స్కోర్ సీక్రెట్..బ్యాంకులు రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఈ 3 రూల్స్ మస్ట్!
రాత్రి వేళల్లో రైలు ఇంజిన్ నుంచి వచ్చే హెడ్‌లైట్ వెలుతురు ఈ పసుపు బోర్డులపై పడినప్పుడు, అది సహజంగానే ఒక రకమైన గ్లో ని ఇస్తుంది. దీని వల్ల రాత్రి ప్రయాణాల్లోనూ లైట్లు లేని చోట కూడా స్టేషన్ పేరు ఇట్టే కనిపిస్తుంది.
బ్రిటీష్ హయాంలో.. ఇండియన్ రైల్వేస్‌ను ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రవాణా వ్యవస్థలపై సుదీర్ఘమైన ప్రయోగాలు చేశారు. రోడ్డు సైనేజ్‌ల నుంచి రైల్వే ట్రాక్ సిగ్నల్స్ వరకు ఏ రంగులు ఎక్కువ సేఫ్టీ ఇస్తాయో రీసెర్చ్ చేసి మరీ ఈ ‘ఎల్లో & బ్లాక్’ థీమ్‌ను ప్రామాణికంగా ఫిక్స్ చేశారు.