Rowdy Sheeter Srikanth: నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మహిళతో సన్నిహతంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్ కు పోలీసులే సహకరించారనే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలపై పోలీసులు స్పందించారు. ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సంఘటనకు సంబంధించి ఎక్కువగా విమర్శలు రావడంతో పోలీసులు ఆయన పెరోల్ ను రద్దు చేశారు.
నా భర్త, శ్రీకాంత్ వాయిస్ ఒకేలా ఉండడంతో ప్రపోజ్ చేశా…
అయితే.. రౌడీ షీటర్ శ్రీకాంత్ తో ఉన్న అరుణ అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. ఆస్ప్రత్రిలో రాసలీల వ్యవహారంపై ఆమె స్పందించింది. ‘నాకు ఆస్తులు బాగా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. నేను వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళ. నా భర్త చనిపోయాడు. నా భర్త, అతనిది ఇద్దరి వాయిస్ ఒకేలా ఉండడంతో నేను ప్రపోజ్ చేశా. ప్రేమించడం తప్పా..? మేం ఇద్దరు కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. ఆ వీడియోలో ఏం తప్పు ఉంది’ అని నిడిగుంట అరుణ చెప్పుకొచ్చింది.
ALSO READ: Weather News: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగులు పడే ఛాన్స్
దువ్వాడ శ్రీను, మాధురిని ఎవరూ తప్పు పట్టడం లేదే..
‘దువ్వాడ శ్రీను, మాధురిని ఎవరూ తప్పు పట్టడం లేదు. నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. ఏ ఆడపిల్ల ఒక ప్రిజనర్ ను పెళ్లి చేసుకోదు. నేను చేసుకున్నానంటే నన్ను అర్థం చేసుకోవాలి. మేం పెళ్లి చేసుకుని నెల్లూరు వదిలి వెళ్లి పోవాలని అనుకుంటున్నా. నా ప్రేమను బతికించండి. ములాఖత్ కు వెళ్లినప్పుడు జైల్లో ఖైదీల బాధలు తెలిశాయి. జీవో నెంబర్ 71 ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి ’ అని నిడిగుంట అరుణ ప్రశ్నించింది.
ALSO READ: Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..
జర్రంతా మా ప్రేమను అర్థం చేసుకోండి..
ఐఏఎస్, ఐపీఎస్ లతో నాకు ఎలాంటి పరిచయాలు లేవు. నేను లాబీయింగ్ చేయించే పరిస్థితిలో లేను. మీడియాలో వచ్చిన వార్తల వల్లే పెరోల్ రద్దు చేశారు. ఇల్లీగల్ పెరోల్ అయితే.. ఆర్డర్ ఇచ్చిన అధికార్ల పేర్లు బయటపెట్టాలి. పిచ్చుక మీద బ్రహ్మస్త్రం వేస్తున్నారు. మా ప్రేమను అర్థం చేసుకోండి’ అని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది..