Actress Poojitha: పూజిత జొన్నలగడ్డ.. తెలుగు నటిగా, హీరోయిన్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె ప్రధానంగా ఈ మధ్య సీరియల్స్ లో నటిస్తూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పూజితాకి బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈమె ‘నువ్వు నేను ప్రేమ’ అనే సీరియల్ తో మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ఇకపోతే పూజిత జొన్నలగడ్డ నటి మాత్రమే కాదు వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త.. అంతేకాదండోయ్ జంతు ప్రేమికురాలు కూడా.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తొలిసారి నోరు విప్పింది. అంతేకాదు తన భర్త తనను గదిలో రహస్యంగా ఉంచి బంధించారని.. పెళ్లయిన 8 నెలల నుంచే మాట్లాడడం మానేసాడని, కొడుకు పుట్టాక ఆ కొడుకుని చేతుల్లోకి కూడా తీసుకోలేదని.. అతడి తల పగిలి రక్తం మడుగుల్లో ఉంటే.. లేవడానికి సంవత్సరం పడుతుందని వైద్యులు చెబితే, నా కష్టంతో మూడు నెలల్లోనే అతడిని బ్రతికించినా.. అతడు పనిమనిషి కంటే హీనంగా చూశాడని, పెళ్లయిన తర్వాత 9 మంది అమ్మాయిలతో ఎఫైర్ నడిపాడని అందులో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు అంటూ హాట్ బాంబు పేల్చింది పూజిత. అంతే కాదు తన వైవాహిక జీవితంలో తాను పడ్డ నరకం గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయింది.
ఏకంగా 9 మందితో ఎఫైర్ నడిపాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పూజిత..
ఇంటర్వ్యూలో భాగంగా తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి కన్నీటి పర్యంతమైన పూజిత మాట్లాడుతూ.. ” మా నాన్న గారు చనిపోవడానికంటే ముందే నా భర్త వ్యసనపరుడు అయిపోయాడు. ఆ విషయం నాకు తెలియదు. కానీ నాన్న చనిపోయాక నన్ను వదిలేశాడు. ఫిలిం ఇన్స్టిట్యూట్లో నా డబ్బుతోనే అచ్యుత్ రెడ్డి స్టూడియోని లీజ్ కి తీసుకున్నాడు. అక్కడే అతడి మోసం, దగా బయటపడ్డాయి. ఎక్కువగా వ్యసనాలకు బానిస అయ్యాడు. చెడు సర్కిల్ తో సావాసం చేసేవాడు. నా డబ్బులు తింటూ తాను డబ్బులు సంపాదించుకొని తన దగ్గర డబ్బులు లేవని చెప్పేవాడు. ఏమేం చేయకూడదో అన్నీ చేసేసి, ఒక ఎంపీకి కాన్వాసింగ్ కి కూడా వెళ్ళాడు. ఆవిడ గెలిచారంట కూడా.. ఆవిడ గెలిచిన తర్వాత ఒక్కొక్క నిజం నాకు తెలుస్తూ వచ్చాయి. ఫేస్బుక్లో ఏకంగా 9 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. మమ్మల్ని బెడ్రూంలో పెట్టి బయట గొల్లం పెట్టేసి బయట వాళ్లతో ఇతడు చాట్, ఫోన్ కాల్స్ చేసేవాడు. అవన్నీ కూడా నాకు తెలియదు. ఒకరోజు నేను షూటింగ్ ముగించుకొని రాత్రి ఆలస్యంగా వచ్చాను. అయితే నేను వచ్చానని తెలుసుకొని.. నిద్రపోతున్నట్టు బెడ్ షీట్ కప్పుకొని నటించాడు. పక్కనే ఫోన్ రింగ్ అవుతున్నా.. ఎందుకు ఫోన్ తీయట్లేదు అనుకున్నాను. మామూలుగా ఫోన్ లేకుండా అతడు బ్రతకలేడు. ఎందుకు ఫోన్ తీయడం లేదు అని చూస్తే పావని అని ఉంది. ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో అనుకొని నేను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో.. బెడ్ రూమ్ లో ఉన్నాను బెడ్ రూమ్ లో ఉన్నాను అన్నావు కదా.. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. నాకు ఇప్పుడు మాట్లాడాలని ఉంది. బాగా మాట్లాడుతున్నావ్ కదా.. సడన్గా ఎందుకు పెట్టేసావ్.. అంటూ మెసేజ్ వచ్చింది.. అప్పుడు నాకర్థం కాలేదు. ఇంకో మెసేజ్.. అలా ఎలా ఒక్క నిమిషంలో నిద్ర పట్టింది అంటూ వచ్చింది. అప్పటికి కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. అతడు మోసం చేస్తున్నాడు అని అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
నగలతోపాటు డబ్బు కూడా దోచుకుపోయాడు..
ఇక తర్వాత ఏకంగా 8 మంది అమ్మాయిలను సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా మోసం చేశాడని, అందులో ఐఏఎస్ రేఖా రాణి కూడా ఉన్నారు అంటూ విస్తుపోయే నిజాలు బయట పెట్టింది పూజిత. అంతేకాదు ఆమెకు అప్పటికే పెళ్లయి, 28 సంవత్సరాల కొడుకు ఉన్నాడని, ఆ వయసులో ఆమె ఇతడు (విజయ్ గోపాల్) ని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యింది అంటూ తెలిపింది. ఇకపోతే విజయ్ గోపాల్ నన్ను మోసం చేశాడు.. ఏకంగా ఇంట్లో ఉండే రెండున్నర కోటి విలువైన నగలతో పాటు సుమారుగా రెండున్నర కోట్ల విలువైన డబ్బు దోచుకుపోయాడు. దాంతో ఉదయం కొడుకుకి బూస్ట్ కొనివ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో.. ప్రతిరోజు కొడుకు కోసం వంద రూపాయలు దాచిపెట్టే అలవాటు ఉండటం వల్ల ఆ డబ్బే మమ్మల్ని కాపాడింది అంటూ కన్నీటి పర్యంతం అయింది పూజిత. ఇక పూజిత చేసిన కామెంట్లకు నెటిజన్స్ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ALSO READ:Vijay Sethupathi: రాజకీయ ఎంట్రీపై పక్కా క్లారిటీ.. ఈ మాత్రం ఉంటే చాలు..!