E-Paper
Advertisement

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!
Advertisement

Amardeep chowdary: అమర్‌దీప్ చౌదరి.. జానకి కలగనలేదు, ఉయ్యాల జంపాల, సిరిసిరి మువ్వలు వంటి సీరియల్స్ తో తనకంటూ మంచి ప్రజాధారణ సొంతం చేసుకున్నారు. టీవీ సీరియల్స్ లోనే కాకుండా షోలలో కూడా సందడి చేస్తూ మంచి పేరు సొంతం చేసుకున్న అమర్‌దీప్ చౌదరి (Amardeep Chaudhary) బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచి మరింత ప్రజాదారణ సొంతం చేసుకున్నారు. ఈ షో తర్వాత ఈ మధ్యకాలంలో పలు టీవీ షోలలో సందడి చేస్తూ మరింత బిజీగా మారిన ఈయన.. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఉప్పల్ బాలు వివాదం పై అమర్‌దీప్ రియాక్షన్..

అందులో భాగంగానే హోస్ట్ ప్రశ్నిస్తూ.. “అగ్ని పరీక్ష జడ్జెస్ గా ఉన్న నవదీప్ , బిందు మాధవి పై మీ అభిప్రాయం ఏంటి ? ముఖ్యంగా నవదీప్ ఇటీవల ఉప్పల్ బాలుని అవమానించారు అనే కామెంట్లు వైరల్ అవ్వడం, ఉప్పల్ బాలు వీడియోలు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కదా.. ముఖ్యంగా నవదీప్ అగ్నిపరీక్ష సీజన్ 2 లో చేసిన కామెంట్లకు కాంట్రవర్సీ కూడా అయ్యింది. అసలు వాళ్ళు ఎలాంటి వారు ? ” అంటూ ప్రశ్నించారు. దీనిపై అమర్‌దీప్ మాట్లాడుతూ.. నా వరకు నవదీప్, బిందుప్రియ ఇద్దరూ మంచివారు. బిందు మాధవి చాలా క్యూట్, స్వీట్ కూడా.. చాలా బాగా మాట్లాడుతారు.. సపోర్టు కూడా ఇస్తారు.

సందర్భం తెలియనప్పుడు.. మాట్లాడడం అనవసరం..

Advertisement

దేవుడు మనకు కోపం , బాధ, ప్రేమ అన్నీ ఇచ్చాడు. ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పగలిగితే మనం దేవుళ్ళమవుతాం కానీ మనుషులం ఎలా అవుతాం.. ఆయనకు ఎప్పుడు ? ఎక్కడ? ఏ సిచువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో అనిపించి.. అలా రియాక్ట్ అయ్యారో ఎవరికి తెలుసు? ఎదుటి వాళ్లు టార్గెట్ అవడం.. మనం ఏదైనా చెప్పడం అనేది చాలా సహజం. ముఖ్యంగా ఎదుటి మనిషి ప్రవర్తన వల్ల కూడా మనలో మార్పులు కలగవచ్చు. ఆ సందర్భంలో నవదీప్ గారికి ఎందుకు కోపం వచ్చిందో.. ఎందుకు అలా మాట్లాడారో మనకు తెలియదు. ఆ సందర్భం గురించి మనకు తెలియదు కాబట్టి తెలియనప్పుడు మనం మాట్లాడకపోవడమే మంచిది” అంటూ మరో వివాదానికి తెర లేపకుండా చాలా తెలివిగా ముగించేశారు అమర్‌దీప్ చౌదరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ: సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

అసలేం జరిగిందంటే?

Advertisement

ఇకపోతే అగ్నిపరీక్ష సీజన్ 2లో కామనర్ గా పాల్గొన్న ఉప్పల్ బాలును నవదీప్ అవమానించారు అంటూ ఉప్పల్ బాలు ఒక వీడియో రిలీజ్ చేశారు. నా వీడియోలు ఎందుకు పనికొస్తాయి అన్నారు? మరి మీ వీడియోలు ఎందుకు పనికి వస్తాయి? అసలు మీ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉంది ? నా ఉసురు మీకు తగులుతుంది? అంటూ పెద్ద ఎత్తున శాపనార్ధాలు పెడుతూ ఉప్పల్ బాలు వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అమర్‌దీప్ చౌదరి ఈ విషయంపై స్మార్ట్ గా సమాధానం ఇవ్వడం వైరల్ గా మారింది.

Related News

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

Big Stories

Advertisement
×