E-Paper
Advertisement

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!
Advertisement

Dancers association:గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలతను గద్దె దించి రఘు మాస్టర్ ను అధ్యక్షుడిగా చేయాలి అని డాన్సర్స్ అంతా కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 23న ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో పలువురు డాన్సర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

అక్టోబర్ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు..

అందులో భాగంగానే డాన్సర్ అసోసియేషన్ న్యూ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న రఘు మాస్టర్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 23న ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డాన్సర్స్ ఆమోదంతో అక్టోబర్ 11న ఎన్నికలు జరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. యూనియన్ మినిట్స్ బుక్ ని సుమలత లాక్కునే ప్రయత్నం చేయడంతోనే ఆ ప్రయత్నాన్ని లేడీ డాన్సర్స్ అడ్డుకున్నారు. వాటికి ఆమె మా మీద కేసులు పెట్టారు. ప్రతి సభ్యుడు ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. కోర్టు స్టే ఇస్తే దానిని మేము గౌరవిస్తాము. బ్యాంకులో అన్ని డాక్యుమెంట్స్ తోనే బ్యాంకు వాళ్లు ఆమోదించారు. మేము అకౌంట్ ని ఫ్రీజ్ చేయడానికి ఫెడరేషన్ ఆమోదంతో చేశాము. దానికి ఆమె మా మీద ఫోర్జరీ కేసు పెట్టారు. ఆరోపణలు చేసి మమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేశారు.

రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్ శాసిస్తే ఏది జరగదు – రఘు మాస్టర్

Advertisement

ఎన్నికల్లో వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. సుమలత గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. శేఖర్ మాస్టర్ , రఘు మాస్టర్ శాసిస్తే ఏదీ జరగదు. సుమలత చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. ఆమె యూనియన్ కోసం మంచి పనులు చేస్తే మేము కూడా సంతోషిస్తాము. మన తెలుగు ఇండస్ట్రీ చాలా బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా.. వాటిని దాటుకొని పోవాలి ” అంటూ రఘు మాస్టర్ తెలిపారు.

యూనియన్ కి సమస్యలు వస్తే అండగా మేము ఉంటాం – అజయ్ మాస్టర్

సమావేశంలో అజయ్ మాస్టర్ మాట్లాడుతూ..” సుమలత చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. ఎన్నికలు అక్టోబర్ 11న జరుగుతాయి. డాన్సర్స్ సమస్యలు తొలగిపోతాయి. యూనియన్ లో ఏమి జరిగినా ప్రశ్నించడానికి మేము ముందుకు వస్తాం ” అంటూ తెలిపారు.

Advertisement

also read:జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

సుమలత విభజించి పాలిస్తోంది- సత్యా మాస్టర్

అలాగే సత్యా మాస్టర్ మాట్లాడుతూ.. “రఘు మాస్టర్ ఇంటికి వందలాది మంది డాన్సర్స్ వెళ్లి.. మీరు ప్రెసిడెంట్గా ఉండాలి అని కోరుకున్నారు. జానీ మాస్టర్ మీద ఉన్న నాన్ కోపరేషన్ తీసేయాలని కూడా మేము కోరుతున్నాము. ఒక యూనియన్ కి సంబంధించిన ఇంటి సమస్య ఇప్పుడు బజారున పడింది. ఒక అసోసియేషన్ లో 600 మంది డాన్సర్స్ ఉన్నారు. అందులో నాలుగు అవినీతి ఎలుకలు ఉన్నాయి. ఆ నాలుగు ఎలుకల గురించి ఇల్లు తగలబెడదాము అంటే ఎలా? ప్రెసిడెంటుగా ఉన్న సుమలత సరైన నిర్ణయాలు తీసుకోవాలి. బలిసిన ఒక ఎలుకని వాళ్లే సపోర్ట్ చేస్తున్నారు. డాన్సర్స్ అసోసియేషన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అసోసియేషన్ ని లేకుండా చేద్దామని చూస్తున్నారు. అందుకే మేము వచ్చి మాట్లాడుతున్నాము. ఫెడరేషన్ మాకు తల్లి లాంటిది. ఫెడరేషన్ అనుకూలంగా ఉంటే ఒకలాగా.. లేకపోతే ఇంకొకలాగా.. సుమలత విభజించి పాలిస్తున్నారు కాబట్టి ఈ సమస్యలు వచ్చాయి.

డాన్సర్స్ కి న్యాయం జరగాలి – సత్య మాస్టర్

మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో సుమలత మనుషులు వచ్చి మాట్లాడుతున్న వారి మైకు లాక్కున్నారు. ప్రెసిడెంట్ హోదాలో వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి మీరే సమర్థిస్తే ఎలా? సుమలత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు . చాలామంది డాన్సర్స్ భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా.. అందుకే సీనియర్స్ అయిన మేము ఇప్పుడు మాట్లాడుతున్నాము. యూనియన్ కి సమస్య వస్తే మేము కచ్చితంగా మాట్లాడుతాము. రిటైర్ అయిన వాళ్ళను వెంటేసుకొని మా సభ్యులతో కావాలని గొడవ పడుతున్నారు. మొన్న బాడీ మీటింగ్ లో ఆమె మినిట్స్ బుక్ ను లాక్కునే ప్రయత్నం చేయడం వల్ల మేము వెళ్ళాము. కానీ ఆమె మా పేర్లు పెట్టి కేసులు పెట్టారు. డాన్సర్స్ కి న్యాయం జరగాలి.. కచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి ” అంటూ తెలిపారు.

Related News

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

ఈ సంక్రాంతి మనదే.. కాకా పై చిరు అప్డేట్!

నాని పై ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందా? సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్నారా?

నన్ను తొక్కేయాలని చూస్తున్నావా? ఫరియా పై చిరు కామెంట్స్ వైరల్!

సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

Big Stories

Advertisement
×