Jaat: ఈరోజుల్లో చాలావరకు బాలీవుడ్ హీరోలు చాలామంది తెలుగులో డెబ్యూ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా సన్నీ డియోల్ కూడా తెలుగులో డెబ్యూ ఇచ్చి అలరించారు. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా సీనియర్ హీరోగా వెలిగిపోతున్నారు సన్నీ డియోల్. అలాంటి తను తెలుగులో నేరుగా సినిమా చేస్తున్నారు అనగానే చాలామంది ఈ మూవీపై విపరీతంగా హైప్ పెంచేసుకున్నారు. తెలుగులో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేనితో సన్నీ డియోల్ సినిమా అనగానే ఇది ఎలా ఉంటుందా అని చర్చలు మొదలయ్యాయి. మొత్తానికి వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జాట్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ క్రిస్టియన్స్ మనోభావాలను మాత్రం దెబ్బతీసింది.
క్రిస్టియన్స్ సీరియస్
సన్నీ డియోల్ (Sunny Deol), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాట్’. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్‌లో ఏసుక్రీస్తు శిలువ ఉందంటూ క్రిస్టియన్స్ ఆగ్రహించారు. అంతే కాకుండా చాలామంది క్రిస్టియన్స్ కలిసి ఈ మూవీ హీరో, డైరెక్టర్, నిర్మాతపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై క్రిస్టియన్స్ సీరియస్‌గా ఉన్నారని తెలిసినా మేకర్స్ పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోయినా అందరిపై ఫిర్యాదు చేయడంతో దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ‘జాట్’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ దీనిపై స్పందిస్తూ ఒక ట్వీట్‌ను షేర్ చేసింది.
తెలివిగా తప్పించుకుంది
‘జాట్ సినిమాలో ఒక సీన్‌ను అందరూ విమర్శిస్తున్నారు. దీంతో వెంటనే సినిమా నుండి ఆ సీన్‌ను తొలగించాం. ఎవరి మతాన్ని కించపరచాలి అన్నది మా ఉద్దేశ్యం కాదు. దానికి మేము రిగ్రెట్ అవుతున్నాం. అందుకే వెంటనే యాక్షన్ తీసుకొని సినిమా నుండి సీన్‌ను డిలీట్ చేశాం. ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వారికి మేము క్షమాపణ చెప్తున్నాం’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్‌ను షేర్ చేసింది. దీంతో కమ్యూనిటీ సభ్యులు కాస్త కుదుటపడ్డారు. కాంట్రవర్సీలు వచ్చినా కూడా చాలామంది మేకర్స్ వాటిని పట్టించుకోకుండా సినిమాలను థియేటర్లలో కొనసాగిస్తూనే ఉంటారు. కానీ ‘జాట్’ టీమ్ అలా చేయకపోవడం వారికి పెద్ద ప్లస్సే అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
Also Read: ఒకే పోలికతో ఉన్న ఈ స్టార్స్‌ను గుర్తుపట్టారా.. సిబ్లింగ్స్ మాత్రం కాదండోయ్.!
దానివల్లే ప్రమోషన్
‘జాట్’ (Jaat) సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించింది. ఈ యాక్షన్ మూవీకి నిర్మాతలు చాలానే ఖర్చుపెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ హీరో అయిన సన్నీ డియోల్ ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఇక ప్రమోషన్స్ సమయంలో టాలీవుడ్, బాలీవుడ్‌ను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్‌లో ఉన్నంత డెడికేషన్ బాలీవుడ్‌లో ఉండదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అందుకే హిందీలో సినిమాలు హిట్ కావడం లేదని కూడా అన్నాడు. అలా సన్నీ డియోల్ చేసిన కామెంట్స్ ‘జాట్’ ప్రమోషన్‌కు విపరీతంగా ఉపయోగపడ్డాయి.
Our sincere apologies to everyone whose sentiments were hurt.
The objectionable scene has been removed.#JAAT pic.twitter.com/vj8tbKDxoi— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025