Coolie Review:ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న చిత్రం కూలీ (Coolie) . భారీ బడ్జెట్లో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan) క్యామియో పాత్ర పోషిస్తున్నారు.. అలాగే ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇప్పటికే ట్రైలర్, టీజర్, పోస్టర్స్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘మోనిక’ అంటూ సాగిన ఈ స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే (Pooja Hegde) ఆకట్టుకుంది. అటు సౌబిన్ షాహీర్ కూడా ఈమెతో పోటీపడి మరీ స్టెప్పులేశారు.
కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు ప్రముఖ కోలీవుడ్ హీరో , తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin). ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా కూలీ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాను ముందుగా చూసే అదృష్టం నాకు లభించింది అంటూ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని ఇలా రాసుకు వచ్చారు.. “సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్ సార్ కు నా హృదయపూర్వక అభినందనలు. రేపు విడుదల కానున్న కూలీ సినిమాను ముందుగానే చూసే అవకాశం నాకు లభించడం నిజంగా సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది.. ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ. ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా ప్రేక్షకుడికి మనసు దోచుకునే చిత్రం” అని స్పష్టం చేశారు.మొత్తానికి అయితే ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన రివ్యూ చూసి నెటిజన్స్ ఈ హీరో ఏంటి ? ఇంత పాజిటివ్గా రివ్యూ ఇచ్చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఓవర్సీస్ లో రికార్డ్ సృష్టిస్తున్న కూలీ..
ఇకపోతే ఈ సినిమాకి ఇప్పటికే ఉత్తర అమెరికాలో అత్యంత ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన తొలి కోలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. రెండు మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసి మరొకసారి రజనీకాంత్ స్టామినా ప్రూవ్ చేసింది. ఇదివరకు ఈ రికార్డు రజనీకాంత్ ‘కబాలి’ మూవీ పేరు మీదే ఉండగా.. ఇప్పుడు కూలీ దానిని దాటేయడం గమనార్హం. మొత్తానికి అయితే ఉదయనిధి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన పోస్ట్.. ఇచ్చిన రివ్యూ రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Aamir Khan: ఈ డిమాండ్ ఏంటి సార్.. 15 నిమిషాల కోసం 20 కోట్లా?
I am truly delighted to congratulate our Superstar @rajinikanth sir on completing 50 glorious years in the film industry.
Had the opportunity to get an early glimpse of his much-awaited movie #Coolie, releasing tomorrow. I thoroughly enjoyed this power-packed mass entertainer… pic.twitter.com/qiZNOj5yKI
— Udhay (@Udhaystalin) August 13, 2025