E-Paper
Advertisement

అనిల్ రావిపూడిలో ఈ క్రియేటివిటీ కూడా ఉందా? ఆ స్టార్ హీరోను భలే రీ క్రియేట్ చేశారే!

అనిల్ రావిపూడిలో ఈ క్రియేటివిటీ కూడా ఉందా? ఆ స్టార్ హీరోను భలే రీ క్రియేట్ చేశారే!
Advertisement

Anil Ravipudi:ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా దూసుకుపోతున్నారు. ‘పటాస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటోంది. ముఖ్యంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలుస్తూ ఉండడం గమనార్హం. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

డ్రామా జూనియర్స్ గ్రాండ్ ఫినాలే..

ఇకపోతే తాజాగా ఈ డ్రామా జూనియర్స్ గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. ఈ సందర్భంగా ట్రోఫీను అందుకోబోయేది ఎవరు అనే ఉత్కంఠ అందరిలో నెలకొన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో జడ్జెస్ గా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఇలా ఎవరికివారు తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి డాన్స్ పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి ఆయన స్టార్ హీరో వెంకటేష్ ను రీ క్రియేట్ చేస్తూ చేసిన డాన్స్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అనిల్ రావిపూడి లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

వెంకటేష్ డాన్స్ తో అదరగొట్టేసిన అనిల్ రావిపూడి..

Advertisement

వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని “ఓ నవ్వు చాలు.. ఎన్నెన్నో వలలు వేస్తూ ఉంటుంది” అనే పాటకు అచ్చం వెంకటేష్ లాగే డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అనిల్ రావిపూడి డాన్స్ పర్ఫామెన్స్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించి ఊహ ప్రజెంట్స్ మరింత ఆకట్టుకుంది.

also read:సుకుమార్ కూతురి ఖాతాలో మరో ఘనత!

శ్రీకాంత్ గురించి ఎవరికీ తెలియని విషయం బయటపెట్టిన ఊహ..

Advertisement

ఊహ స్టేజ్ పైకి రాగానే మీరు వచ్చిన తర్వాతే ఈ గ్రాండ్ ఫినాలే కి మరింత అందం వచ్చింది అంటూ సుధీర్ తెలిపాడు. శ్రీకాంత్ అన్న స్కిట్లు ఎలా అనిపిస్తాయి మీకు అని అడగగా.. నాకే కొత్తగా ఉంది అంటూ ఊహా తెలిపింది. ఇంట్లో నన్ను ఉమా అని పిలుస్తారు అని ఊహా చెప్పగా.. మీరేమని పిలుస్తారు అని అడిగితే ఏవండీ అని పిలుస్తాను అని తెలిపింది ఊహ.. శ్రీకాంత్ మాట్లాడుతూ అనిల్ ఏంటి ఏవండీనే కదా అని అడగగా నా గురించి ఎందుకు లేండి అంటూ కామెంట్ చేశాడు. ఇక శ్రీకాంత్ అన్న గురించి మాకు తెలియని ఏదైనా ఒక విషయం చెప్పండి అని సుధీర్ అడగగా.. ఊహ మాట్లాడుతూ..” ఉదయం 5 గంటలకే లేచి పూజ చేస్తారు” అంటూ ఆయనకున్న భక్తి పారవశ్యాన్ని ఆమె బయట పెట్టారు.

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

Big Stories

Advertisement
×