E-Paper
Advertisement

ఈ బొమ్మను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… సీల్ తొలగించగానే మారణహోమం… తెలుగులో స్ట్రీమింగ్

ఈ బొమ్మను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… సీల్ తొలగించగానే మారణహోమం… తెలుగులో స్ట్రీమింగ్
Advertisement

Horror Thriller OTT : ఈ బొమ్మను ముట్టుకుంటే ప్రాణాలతో బయటపడటం కష్టమే… వందల ఏళ్లుగా సీల్ చేసి దాచిన ఆ బొమ్మను ఓ దొంగ ముట్టుకోవడంతో ఒక్కసారిగా ఆ ఎస్టేట్‌లో మారణహోమం మొదలైతే ? అసలు ఆ బొమ్మలో బంధించబడిన యక్షిణి ఎవరు ? ఆమెకు అంతటి పగ ఎందుకు వచ్చింది ? ఇలాంటి భయంకరమైన ప్రశ్నలతో ఆసక్తి పెంచే మలయాళ హారర్ థ్రిల్లర్ ‘అరూపి’ (Aroopi). ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు కూడా వచ్చింది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

వందల ఏళ్ల క్రితం ఆర్యనాట్టు అనే పురాతన రాజవంశానికి చెందిన ఒక ఎస్టేట్‌లో జరిగిన భయంకరమైన ఘటనతో ఈ కథ మొదలవుతుంది. పద్మిని అనే ఒక శక్తివంతమైన యక్షిణి తీవ్రమైన పగతో రగిలిపోతుంటుంది. ఆమె ఆత్మను ఒక చెక్క బొమ్మలో బంధించి, దానిపై ప్రత్యేకమైన సీల్ వేస్తారు. ఆ బొమ్మను ఎవరూ తాకకూడదని, దాని రహస్యాన్ని ఎవరూ బయట పెట్టకూడదని తరతరాలుగా కాపాడుతూ వస్తారు.

Advertisement

కానీ ప్రస్తుత కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. పురాతన ఎస్టేట్‌లో విలువైన వస్తువులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇద్దరు దొంగలు అక్కడికి చొరబడతారు. వారికి అక్కడ దొరికిన వింతైన చెక్క బొమ్మ గురించి అసలు విషయం తెలియదు. విలువైన పురాతన వస్తువుగా భావించి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో, అనుకోకుండా బొమ్మపై ఉన్న సీల్ తొలగిపోతుంది. అంతే… ఇన్నాళ్లుగా బంధించబడిన పద్మిని ఆత్మ ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఎస్టేట్‌లో జరుగుతున్న పరిణామాలు భయంకరంగా మారిపోతాయి. అక్కడికి వచ్చిన వారిని ఒక్కొక్కరినీ లక్ష్యంగా చేసుకుంటూ ఆ యక్షిణి తన పగ తీర్చుకోవడం మొదలుపెడుతుంది. ఆమెను ఆపడం సాధ్యమా లేదా అనే ప్రశ్నే అందరిలో భయాన్ని పెంచుతుంది.

ఇదిలా ఉంటే, ఎస్టేట్‌కు తిరిగి వచ్చిన వంశ వారసుడు నిరంజన్‌కు అసలు పరిస్థితి అర్థం కావడం మొదలవుతుంది. ఆ బొమ్మ వెనుక ఉన్న చరిత్ర ఏంటి ? పద్మినిని ఎందుకు ఆ బొమ్మలో బంధించారు ? ఆమె పగకు కారణం ఏమిటి ? ఈ శాపం నుంచి నిరంజన్, అక్కడ ఉన్న ఇతరులు ఎలా బయటపడాలి ? అనే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ మరింత సస్పెన్స్ తో సాగుతుంది.

Advertisement

Also Read : నాలుగేళ్ల పాప ఆకలితో పోరాడిన కథ… ఈ మూవీని కొట్టే మూవీ ఇప్పటిదాకా రాలేదు భయ్యా

ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

అభిలాష్ వారియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైశాఖ్ రవి, నేహా చావ్లా, జాయ్ మాథ్యూ, సాక్షి బదాలా తదితరులు నటించారు. హారర్‌తో పాటు సస్పెన్స్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్‌ను కలిపిన ‘అరూపి’లో పురాతన శాపం, యక్షిణి, రహస్యమైన బొమ్మ, ఎస్టేట్ నేపథ్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. భయంకరమైన వాతావరణంతో పాటు కథలో దాగి ఉన్న మిస్టరీని చివరి వరకు తెలుసుకోవాలనుకునే వారికి ఈ సినిమా మంచి హారర్ వాచ్. ఆగస్టు 14 నుంచి Amazon Prime Videoలో ఈ చిత్రాన్ని చూడవచ్చు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ ఆడియోలతో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×