E-Paper
Advertisement

సుకుమార్ కూతురి ఖాతాలో మరో ఘనత!

సుకుమార్ కూతురి ఖాతాలో మరో ఘనత!
Advertisement

Sukumar daughter sukriti:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుకుమార్ (Sukumar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన టేకింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈయన.. హీరోలకు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందిస్తూ దూసుకుపోతున్నారు. తండ్రికి తగ్గ కూతురిగా సుకృతి వేణి(Sukriti veni) కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. సాధారణంగా సెలబ్రిటీల ద్వారానే వారి పిల్లలకు గుర్తింపు లభిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సుకుమార్ కూతురు సుకృతి మాత్రం తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను పక్కన పెట్టి.. తన సొంత టాలెంట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఏకంగా నేషనల్ అవార్డును అందుకొని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అలాంటి సుకృతి ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది.

సుకృతి ఖాతాలో మరో అవార్డు..

సుకుమార్ కూతురుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుకృతి ఇప్పటికే ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏకంగా నేషనల్ అవార్డు అందుకొని.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. అయితే ఇప్పుడు తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న ఈమె సింగర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల సౌత్ కొరియాకు కూడా వెళ్లి ఒక కాన్సర్ట్ లో మెయిన్ సింగర్ గా కూడా పెర్ఫార్మ్ చేసింది సుకృతి. అందులో ఇంగ్లీష్ పాటను హాలీవుడ్ స్టైల్ లో పాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా అమెరికాలోని బోస్టన్ లో ఉండే అంతర్జాతీయ బర్కేలీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్లో సంగీత విభాగంలో ఎన్సెంబల్ ఎక్సెలెన్స్ అవార్డుకు ఎంపికై ఫుల్ స్కాలర్షిప్ ను సొంతం చేసుకుంది.

పూర్తి స్కాలర్షిప్ అందుకున్న ఏకైక విద్యార్థినిగా గుర్తింపు..

Advertisement

ఇకపోతే బోస్టన్ లోని బర్కెలి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో వచ్చే ఏడాది సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రాం కోసం ఫుల్ స్కాలర్షిప్ కి సుకృతి వేణి అర్హత సాధించింది. మొత్తం 272 మంది ఈ స్కాలర్షిప్ కోసం ఆడిషన్ ఇవ్వగా.. అందులో కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్షిప్ లభించింది. అందులో కూడా ఈ సింగర్స్ విభాగంలో పూర్తి స్కాలర్షిప్ అందుకున్న ఏకైక విద్యార్థినిగా సుకృతి వేణి రికార్డు సృష్టించింది. దీంతో సుకుమార్ కూతుర్ని మరోసారి సెలబ్రిటీలు, నెటిజన్స్ అభినందిస్తున్నారు. మొత్తానికైతే తండ్రికి తగ్గ కూతురు అంటూ వరుస రికార్డులతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది సుకృతి వేణి.

also read: హోస్ట్ గా మారుతున్న మరో స్టార్ హీరో?

సుకుమార్ సినిమాలు..

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ఈయన.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక రామ్ చరణ్ తో RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయనున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ చేతి మణికట్టుకి సర్జరీ అయిన కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన సెట్ బ్యాక్ అయిన తర్వాత షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Advertisement

Related News

నిర్మాత కారు యాక్సిడెంట్.. హాస్పిటల్ ఖర్చుల దగ్గరే అసలు గొడవ!వైరల్ వీడియో

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరిదో? తెరపైకి ముగ్గురు డైరెక్టర్లు!

కిమ్స్ హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. సర్జరీ తర్వాత తొలి ఫోటో!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగని ‘ డ్రాగన్’ మూవీ షూటింగ్!

కలిసొచ్చిన లక్కీ భాస్కర్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీకి భారీ బిజినెస్!

రీల్స్ చూసి ఆసుపత్రిపాలైన షకీలా!

బ్రేకప్ పై స్పందించిన అనుపమ.. ఇంకొన్నాళ్లు రిలేషన్షిప్ లో ఉండుంటే చనిపోయేదాన్ని!

Big Stories

Advertisement
×