Anshu Reddy: వెండితెరపై ఉండే నటులకు మాత్రమే కాదు.. బుల్లి తనపై ఉన్న నటులకు కూడా ట్రోల్స్ తప్పడం లేదు.. ఈమధ్య ఎంతోమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.. ఇష్టం వచ్చినట్టు వార్తల్ని వార్చిపారేయడమే. వాళ్ల ఎమోషన్స్‌తో కానీ.. వాళ్ల పరువు, ప్రతిష్ఠలతో కానీ సంబంధమే లేదు. వీడియో చేశామా? వ్యూస్ వచ్చాయా? ఇదే పంథాలో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్న ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ దుమ్ము దులిపేసింది టీవీ సీరియల్ యాక్టర్ అన్షు రెడ్డి.. మా పరువు తీశారంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అంతగా బాధపడటానికి అసలు కారణం ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ పై ఫైర్..
ఈమధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యూస్ కోసం ఏదైనా రాసేస్తామన్నట్లుగా వ్యవహారిస్తున్నాయి. అన్షు రెడ్డి, ప్రియా రెడ్డిలకు దారుణమైన అవమానం జరిగేలా చేశాయి. అన్షరెడ్డి, శ్రీ ప్రియ రెడ్డిలు ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్ షిప్‌లో ఉన్నారు. ఫ్యామిలీ రిలేషన్ కంటే ఎక్కువగా వీళ్ల స్నేహాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. అయితే వీరిద్దరు కలిసి ట్రిప్ లకు వెళ్లడంతో ఇద్దరు కలిసి జాలిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించి.. వాళ్లి బంధానికి లెస్బియన్ అనే ఓ భయంకరమైన అబద్దాన్ని మసి పూసి మారేడుకాయ చేసింది. వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దీనిపై ఆ ఇద్దరు సీరియస్ అయ్యారు. ఎక్కడికి వెళ్లినా కూడా కలిసే వస్తుంటారు. దాంతో వాళ్లిద్దర్నీ చూసి లెస్బియన్స్ అనే టాక్ ఇండస్ట్రీలో ఎక్కువైపోయింది.. దీనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆ ఛానెల్ ను అన్ ఫాలో చెయ్యండి అని రిక్వెస్ట్ చేశారు.
Also Read: గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ మూడింటి మిస్ చెయ్యకండి..
అన్షు రెడ్డి సీరియల్స్..
అన్షు రెడ్డి సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనని తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీప్రియ రెడ్డిని లెస్బియన్ అంటూ కథనాలు పుట్టించిన ఆ యూట్యూబ్ ఛానల్‌పై మండిపడుతూ.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్‌లు పెట్టింది.. అందరు ఆ యూట్యూబ్ ఛానల్‌ని.. సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫోలో చేయాలని కోరుతూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది.. మీలాంటి చెత్త ఫెలోస్ కి ఏం పని పాట లేదా మాలాంటి వాళ్ళని గెలకడం తప్ప అని అన్షు ఫైర్ అయింది..ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రసారం చేసినందుకు. దయచేసి ఇలాంటి తప్పుడు చెత్త ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరి జీవితాలను వారిని బ్రతకనివ్వండి అంటూ ఆమె మండిపడ్డారు.. ఈ వీడియోను వెంటనే తొలగించి క్షమాపణ చెప్పండి. సెలబ్రిటీలు కూడా మనషులే అని గుర్తించండి. ఇక ఈమె ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు బుల్లితెర పడి ప్రసారమవుతున్న ప్రముఖ డాన్స్ షో ఢీలో కంటెస్టెంట్ గా చేస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు టాప్ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.