E-Paper
Advertisement

త్రిగుణ్ కూతురిపై అపూర్వ కామెంట్..హద్దులు దాటుతున్న మాటలు!

త్రిగుణ్ కూతురిపై అపూర్వ కామెంట్..హద్దులు దాటుతున్న మాటలు!
Advertisement

Bigg boss 10: బిగ్ బాస్.. చిన్నను మొదలుకొని పెద్దవాళ్ల వరకు.. ఫ్యామిలీ ఆడియన్స్ ని మొదలుకొని బ్యాచిలర్స్ వరకు ఎంతో ఆసక్తిగా చూసే రియాలిటీ షో ఇది. అందరూ చూసే ఈ షో లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటికే 9 సీజన్లు చూసిన కంటెస్టెంట్స్ ఇప్పుడు హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మాటలు హద్దులు దాటుతున్న తీరు ఆడియన్స్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంతేకాదు సదరు కంటెస్టెంట్స్ పై నెగెటివిటీని కూడా క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా కంటెంట్ కోసం రొమాన్స్ వలకబోయడం, గొడవల్లో మాటలు జారడం, ఒక కంటెస్టెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసేటప్పుడు వారి కుటుంబీకులను కూడా ఈ గొడవల్లోకి తీసుకురావడం..ఇవన్నీ చూసే ఆడియన్స్ కి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

త్రిగుణ్ vs అపూర్వ..

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి మూడవ వారం అగ్నిపరీక్షలో సత్తా చాటి కామనర్ గా హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన అపూర్వ.. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ప్రముఖ నటుడు త్రిగుణ్ తో విభేదాలు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నా.. ఇద్దరి మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. అనూహ్యంగా త్రిగుణ్ చేసిన మాటలను దృష్టిలో పెట్టుకొని అపూర్వ కాస్త హద్దులు దాటుతూ.. ఏకంగా ఆయన కూతుర్నే ఇందులోకి తీసుకురావడం సంచలనంగా మారింది. అసలు అపూర్వ మాట్లాడిన మాటలకు అర్థం ఉందా? ఆయన కూతుర్ని అనాల్సిన పనేముంది? అంటూ ఆమెపై నెటిజెన్స్ విరుచుకుపడుతుంటే.. మరికొందరు అపూర్వను త్రిగుణ్ ఏమంత అనరాని మాట అన్నారో తెలియాలి కదా అంటూ ఆమెకు వత్తాసు పలుకుతున్నారు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

హద్దులు దాటిన మాటలు..

Advertisement

వీకెండ్స్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన మూడవ ప్రోమోలో జరిగిన సంభాషణ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రోమోలో ఈ ఐదు వారాల ఆటను బట్టి హౌస్ లో ఉండడానికి ఎవరు అనర్హులో చెప్పాలి అని కంటెస్టెంట్స్ మధ్య ఒక టాస్క్ నిర్వహించారు నాగార్జున. టాస్క్ లో భాగంగా అపూర్వ మాట్లాడుతూ.. త్రిగుణ్ హౌస్ లో ఉండడానికి అనర్హుడు అంటూ అతడి ఫేస్ పై స్టాంపు వేసింది. గేమ్ లో ముందుకు వెళ్లడం కోసం అవతల వాళ్లను తొక్కేసి, బార్డర్ క్రాస్ చేసి పైకి వెళ్ళే వ్యక్తి త్రిగుణ్ అని నాకు అనిపించింది సార్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది అపూర్వ.

త్రిగుణ్ మాట్లాడిన మాటలకు అపూర్వ కన్నీళ్లు..

త్రిగుణ్ మాట్లాడుతూ..” అందరికీ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గొడవల్లోకి కుటుంబాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. హౌస్ లోకి తను వచ్చినప్పటి నుంచి నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయింది” అని త్రిగుణ్ చెప్పగానే.. అపూర్వ మాట్లాడుతూ..” నా లిప్స్ గురించి మాట్లాడారు కాబట్టి.. ఆయన కూతురు విషయంలో కూడా అలాగే అనిపించి..మీ కూతురికి కూడా సారీ” అని చెప్పాను అని అపూర్వ చెబుతుంది. దీనికి త్రిగుణ్ మాట్లాడుతూ..” ఇంట్లో ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారు. ఎవరితోనైనా నేను తప్పుగా మాట్లాడాను అని అంటే, వెంటనే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను ” అంటూ తెలిపాడు.

Advertisement

also read:అపూర్వ ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ఎంట్రీలో సంపాదించింది ఎంతంటే?

కన్నీళ్లను ఆయుధంగా మార్చుకుందా..

త్రిగుణ్ మాటలకు అపూర్వ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. త్రిగుణ్ మాట్లాడుతూ..” దయచేసి ఏడవకు. స్ట్రాంగ్ గా ఉండు.. నీ కన్నీళ్లను ఆయుధంగా మార్చుకోకు” అంటూ కామెంట్ చేశాడు. దీనికి నాగార్జున మాట్లాడుతూ..” ఎవరు కూడా కన్నీళ్ళను ఆయుధంగా మార్చుకోలేరు.. హెల్ప్ లెస్ సమయంలో మాత్రమే ఆ కన్నీళ్లు బయటకు వస్తాయి” అంటూ తెలిపారు.

త్రిగుణ్ పై నాగార్జున ఫైర్..

ఒకరు ఒక విషయంలో ఏడ్చినప్పుడు తప్పులేదు.. కానీ మొసలి కన్నీళ్లు కార్చినప్పుడే వాళ్ల స్వరూపం బయటపడుతుంది అంటూ త్రిగుణ్ కాస్త నోరు జారారు. ఇక నాగార్జున మండిపడుతూ..” త్రిగుణ్ నీ మాటల్ని నువ్వు వెనక్కి తీసుకో.. కన్నీళ్లు ఎలాంటివో నిర్ణయించడానికి నువ్వు ఎవరివి?” అంటూ ప్రశ్నించారు. మొత్తానికైతే త్రిగుణ్, అపూర్వ మధ్య వార్ గట్టిగానే జరిగినట్లు మనం నేటి ఎపిసోడ్లో చూడవచ్చు.

Related News

జగపతిబాబు హోస్ట్ గా ఐకానిక్ టాక్ షో సీజన్ 2 ప్రారంభం… వీడియో వైరల్!

నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారంటే ..బషీర్ మాస్టర్ ఆన్సర్ ఇదే !

ఇంద్రజ జబర్దస్త్ రెమ్యునరేషన్ అంతా.. మరి నాగబాబుకి?

బిగ్ బాస్ 10 విన్నర్ పై కౌశల్  మండా కామెంట్స్.. నవరసాలు పండిస్తున్న కంటెస్టెంట్ అంటూ!

అపూర్వ ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ఎంట్రీలో సంపాదించింది ఎంతంటే?

సోల్ మేట్ దొరికేశాడు..పెళ్లి పీటలెక్కబోతున్న రోహిణి!

రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

Big Stories

Advertisement
×