Bigg Boss 10 Apoorva:బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ షో గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 10 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దశావతారం అనే థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షో.. 16 మంది కంటెస్టెంట్స్ తో రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 10 మంది సెలబ్రిటీలు , 6 మంది కామనర్స్ తో షో ప్రారంభం అయింది.. అయితే అందులో మొదటివారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. కానీ చరణ్ మళ్లీ హౌస్ లోకి వచ్చారు. ఇక రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు.
మూడవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ జరిగాయి. అలా అపూర్వ , మిథిలేష్ హౌస్ లోకి అడుగుపెట్టారు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ ఇచ్చిన సూట్ కేస్ ఆఫర్ 15 లక్షలు తీసుకొని మిథిలేష్ హౌస్ నుండి వెళ్లిపోయారు. అపూర్వ మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ అయింది. ఇక ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ తీసేసి ఊహించని కంటెస్టెంట్ అపూర్వ ఎలిమినేట్ అయ్యింది. అయితే హౌస్ లోకి వచ్చిన మూడు వారాలకే ఆమె ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు
also read:సోల్ మేట్ దొరికేశాడు..పెళ్లి పీటలెక్కబోతున్న రోహిణి!
హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుండి అందరితో గొడవలు పెట్టుకుంటూ వార్తలో నిలిచింది. ముఖ్యంగా వచ్చిన వారంలోనే కెప్టెన్ అయినప్పటికీ కూడా తన అరుపులతో హౌస్ మేట్స్ ను కూడా దూరం చేసుకుంది. పైగా నిన్నటి ఎపిసోడ్లో హౌస్ మేట్స్ అందరూ కూడా ఈమెకు వ్యతిరేకంగా గేమ్ నుంచి పంపించడం కూడా హౌస్ మేట్స్ లో ఈమె ఎంత నెగెటివిటీ క్రియేట్ చేసుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనం . పైగా అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన రోహిత్, శాలిని, అమన్ కూడా ఆమెకు దూరంగా ఉండడంతో ఎక్కువగా చరణ్ తో కలిసి గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేసింది . పైగా మొదటి రోజు నుంచి త్రిగుణ్ తో పోటీ పడుతూ వివాదాలు సృష్టిస్తున్న ఈమె.. ఇక ఐదవ వారంలో నామినేషన్ లో నిలిచింది. ఇకపోతే హౌస్ లో ఎక్కువగా అరుస్తూ అటు నాగార్జున చేత కూడా అర్ పూర్వ అనిపించుకున్న ఈమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఈ కారణం చేతనే అపూర్వ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇక రేపటితో అపూర్వ హౌస్ ను వీడనుంది.
అగ్ని పరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది అపూర్వ . ఇక కామనర్ కి సుమారుగా 50వేల నుండి 75 వేల వరకు రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లూ సమాచారం. ఇక మూడు వారాలకు గాను వారానికి 75, 000 చొప్పున రూ.2,25,000 లభించినట్లు సమాచారం. పైగా అగ్నిపరీక్షలో పాటిస్పేట్ చేసినందుకు 50,000 లభించాయని, అలా మొత్తంగా మూడు లక్షల లోపే ఈమెకు రెమ్యూనరేషన్ అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.