E-Paper
Advertisement

ఫిష్ ప్రియులు ‘కరిమీన్ పొల్లిచాతు’ ఇలా ట్రై చేయండి.. ఈ రుచిని అస్సలు మర్చిలేపోరు!

ఫిష్ ప్రియులు ‘కరిమీన్ పొల్లిచాతు’ ఇలా ట్రై చేయండి.. ఈ రుచిని అస్సలు మర్చిలేపోరు!
Advertisement

Karimeen Pollichathu Recipe: కేరళ అందాలను గుర్తు చేసుకోగానే పచ్చని కొబ్బరి తోటలు, కనుచూపు మేర విస్తరించిన బ్యాక్‌వాటర్స్‌తో పాటు నోరూరించే సంప్రదాయ వంటకాలు కూడా గుర్తుకొస్తాయి. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో ‘కరిమీన్ పొల్లిచాతు’ ముందు వరుసలో ఉంటుంది. కేరళకు వెళ్లినప్పుడు తప్పక రుచి చూడాలనిపించే ఈ వంటకం, ఇప్పుడు ఫిష్ లవర్స్‌కు కూడా ఎంతో ఫేవరెట్‌గా మారింది.

తాజా కరిమీన్ చేపకు కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి రుచులు అద్ది, అరటి ఆకులో చుట్టి కొబ్బరినూనెలో నిదానంగా కాల్చితే వచ్చే రుచే వేరు. అరటి ఆకు సువాసన, మసాలాల ఘాటు, చేపలోని మెత్తదనం కలిస్తే ప్రతి ముక్కా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంత ప్రత్యేకమైన కేరళ వంటకాన్ని రుచి చూడాలంటే ఇక రెస్టారెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మన ఇంట్లోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

కరిమీన్ చేపలు – రెండు
చింతపండు రసం – రెండు స్పూన్లు
కారం – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
నిమ్మరసం – ఒక స్పూన్
ఉల్లిపాయలు – రెండు
టమోటాలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
సన్నగా తరిగిన అల్లం – ఒక స్పూన్
సన్నగా తరిగిన వెల్లుల్లి – ఒక స్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
ధనియాల పొడి – ఒక స్పూన్
గరం మసాలా – అర స్పూన్
కొబ్బరినూనె – మూడు స్పూన్లు
అరటి ఆకులు – రెండు
రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం:

చేపలను శుభ్రంగా కడిగి, రెండు వైపులా చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సగం కారం, సగం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మసాలాను చేపలకు బాగా పట్టించి అరగంట సేపు పక్కన ఉంచాలి.

Advertisement

తర్వాత పాన్‌లో కొద్దిగా కొబ్బరినూనె వేసి, మసాలా పట్టిన చేపలను రెండు వైపులా సగం వేగేలా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక, టమోటా ముక్కలు కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు మిగిలిన కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. చివరిగా చింతపండు రసం కలిపి దగ్గరకు ఉడికించి దించేయాలి.

ఇప్పుడు అరటి ఆకులను నిప్పులపై తేలికగా కాల్చితే అవి విరిగిపోకుండా మెత్తబడతాయి. ఒక ఆకును తీసుకుని మధ్యలో కొంత మసాలా రాయాలి. దానిపై వేయించిన చేపను ఉంచి, మళ్లీ పైన మసాలా పూసి చేపను పూర్తిగా కప్పేయాలి. ఆకును నాలుగు వైపులా మూసి దారంతో గట్టిగా కట్టాలి. పాన్‌పై కొద్దిగా నూనె రాసి, సిద్ధం చేసిన అరటి ఆకు పార్సెల్ ఉంచి సన్నని మంటపై రెండు వైపులా పది నిమిషాల పాటు కాల్చుకుంటే గుమగుమలాడే కరిమీన్ పొల్లిచతు సిద్ధమవుతుంది.

Tags

Related News

మటన్ ప్రియుల కోసం గుంటూరు స్పెషల్ గోంగూర మటన్.. తయారీ విధానం ఇదిగో!

నోరూరించే కోనసీమ పీతల పులుసు.. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు!

అచ్చమైన పల్లెటూరి రుచిలో..ఘుమఘుమలాడే ఎండుచేపల కూర!

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×