E-Paper
Advertisement

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి
Advertisement

Malayalam Comedy Fantasy Movie OTT : మనకు కష్టమొస్తే కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తాం. ఒంటరిగా అనిపిస్తే స్నేహితులతో సమయం గడుపుతాం. మరి అసలు బంధువులు, స్నేహితులు ఎవరూ లేకపోతే? తన చుట్టూ ఉన్నవారితో కాకుండా చనిపోయిన వాళ్లతోనే అనుబంధం పెంచుకుంటూ, వాళ్లనే తన కుటుంబంగా భావించే ఓ వింత మనిషి ఉంటే… పైగా అలాంటి వ్యక్తి జీవితంలోకి ప్రేమ కూడా వస్తే.. అతడి ప్రపంచం ఎలా మారుతుంది ? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా, నవ్వులు పంచుతూనే ఒంటరితనం, ప్రేమ, మానవ సంబంధాల గురించి ఆలోచింపజేసే కథతో వచ్చిన మలయాళం మూవీ Sukhamano Sukhamann. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో థియో అనే యువకుడు ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచే ఒంటరితనంతో పోరాడుతున్న అతడికి కుటుంబ సభ్యుల అండ, స్నేహితుల తోడు పెద్దగా ఉండవు. ఇతరులతో కలిసిపోలేక, తన బాధలను మనసులోనే దాచుకుంటూ జీవిస్తుంటాడు. అతడి జీవితంలో జరిగిన చిన్ననాటి కష్టాలు కూడా ఈ ఒంటరితనానికి కారణమవుతాయి. అందరిలా సాధారణంగా జీవించాలనే కోరిక ఉన్నప్పటికీ, మనుషులతో అనుబంధం పెంచుకోవడం అతడికి కష్టంగా ఉంటుంది.

Advertisement

థియో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. తన విధుల్లో భాగంగా మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లే సందర్భాలు అతడికి ఎదురవుతుంటాయి. అయితే ఇతరులకు సాధారణంగా కనిపించే ఈ పని, థియో జీవితంలో మాత్రం ఓ విచిత్రమైన మలుపుకు కారణమవుతుంది. అంత్యక్రియలకు వెళ్లే క్రమంలో అతడు కలిసే మరణించిన వ్యక్తులను తనకు దగ్గరి వారిగా భావించడం మొదలుపెడతాడు. చివరకు వాళ్లలోనే తన కుటుంబాన్ని వెతుక్కుంటాడు. ఇతరులు దెయ్యాలుగా భావించి భయపడే ఆత్మలను అతడు మాత్రం తనవారిలా చూసుకుంటాడు.

ఇక్కడే కథలో కామెడీ మొదలవుతుంది. చనిపోయిన వ్యక్తులతో అనుబంధం పెంచుకుంటూ, వాళ్లతోనే తనకు కుటుంబం ఉందనే భావనలో జీవించే థియో ప్రవర్తన చుట్టూ ఎన్నో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దాని వెనుక ఎవరికీ చెప్పుకోలేని బాధ, ప్రేమ కోసం ఎదురుచూసే మనసు, తనను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనే కోరిక ఉంటాయి. ఇలాంటి సమయంలో థియో జీవితంలోకి చారు అనే యువతి ప్రవేశిస్తుంది. ఆమెతో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. తన జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తితో నిజమైన అనుబంధాన్ని ఏర్పరుచుకునే అవకాశం థియోకు ఎదురవుతుంది.

Advertisement

కానీ ఈ ప్రేమకథలోనూ ఓ ఊహించని మలుపు ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించే చారు, తన మరణం గురించి ఓ నాటకం ఆడుతుండటంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయి. ఆమె నిజంగా ఏం కోరుకుంటోంది ? థియోతో ఆమెకు ఏర్పడిన బంధం అతడి జీవితాన్ని ఎలా మార్చబోతోంది ? మనిషికి నిజంగా కావాల్సింది ఏంటి? ఒంటరితనాన్ని దూరం చేసేది కుటుంబమేనా, స్నేహమా, ప్రేమనా ? చివరికి సినిమాలో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మలయాళం మూవీని మస్ట్ వాచ్.

Also Read : పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

తెలుగులో ఉందా లేదా ?

‘సుకమనో సుఖమన్’ 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన మలయాళం కామెడీ ఫాంటసీ చిత్రం. అరుణ్‌లాల్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాథ్యూ థామస్ థియో పాత్రలో, దేవికా సంజయ్ చారు పాత్రలో నటించారు. జగదీష్, మణికుట్టన్, నోబీ మార్కోస్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా మే 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. కానీ తెలుగు ఆడియో అందుబాటులో లేదు.

Related News

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

పక్షిలో మాంత్రిక శక్తులు… దేవుళ్లు, రాక్షసుల మధ్య చిక్కుకునే యువతి… హర్రర్ ఫాంటసీ సిరీస్

కోహినూర్‌ను మించిన వజ్రం కోసం వేట… హంపి ట్రిప్ లో అదిరిపోయే ఛేజింగ్… బెంగాలీ అడ్వెంచర్ థ్రిల్లర్

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

Big Stories

Advertisement
×