E-Paper
Advertisement

సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
Advertisement

Sandhya Theatre:ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ అంటేనే సినిమాలకి పెట్టింది పేరు ..ఒకవైపు ఉషామయూరి,మరో వైపు ఓడియన్, ఇంకో వైపు సంధ్య ఇలా ఎటు చూసినా సినిమా థియేటర్లు ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవి.కానీ కాల క్రమంలో కొన్ని థియేటర్స్ మూత పడితే మరికొన్ని థియేటర్లు రూపం మార్చుకుని మల్టీ ఫ్లెక్స్ లుగా మారితే ఇక మరికొన్ని షాపింగ్ మాల్స్ గా రూపు దిద్దుకున్న పరిస్థితి.

అయితే వీటిలో సంధ్య 70MM, సంధ్య 35MM థియేటర్ మాత్రం ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండి ఎందరో అభిమానులకి అలరిస్తూనే ఉంది.మరి ఎన్నో ఏళ్లుగా ఎన్నో సినిమాలని అభిమానులకి చూపించిన ఈ సంధ్య థియేటర్ అసలెప్పుడు మొదలైందో, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటో తెలుసుకుందాం.

Advertisement

1979 జనవరి 18న 

ఈ సంధ్య థియేటర్ ని M.చంద్రయ్య అనే వ్యక్తి నిర్మించగా 1979 జనవరి 18న  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి జి. వెంకటస్వామి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయిందని చరిత్ర చెబుతుంది. M.చంద్రయ్య అప్పట్లోనే ట్రాన్స్పోర్ట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలలో బాగా డబ్బు సంపాదించి 1976 ప్రాంతంలో చిక్కడపల్లి ఎక్స్‌రోడ్స్ మో భూమి కొని సంధ్య థియేటర్ ని కట్టారని సమాచారం.అయితే ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే అని మనం పరిగణించాలి.

Advertisement

ఇక ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటో తెలుసా .. ఈ థియేటర్ లో మొదటగా మన తెలుగు సినిమా కాకుండా ఒక హిందీ సినిమా స్క్రీన్ అవ్వడమే.అవును… ‘షాలిమార్ ‘అనే హిందీ సినిమా ఇందులో మొదటిసారిగా పడిందని, ఇక రెండో సినిమాగా ‘షోలే’ పడిందని చరిత్ర చెబుతుంది.

1981లో దాని పక్కనే సంధ్య 35ఎంఎం

ఇక కేవలం సంధ్య 70MM తోనే ఆగిపోకుండా 1981లో దాని పక్కనే సంధ్య 35ఎంఎం ను కూడా తీసుకువచ్చి ఒకే దగ్గర రెండు స్క్రీన్లతో మరింత పెద్దదిగా నిర్మించడంతో అది కాస్తా సినిమాలకి ఒక అడ్డాగా మారిపోయింది. ఇక అప్పట్లో ఒక సినిమా హిట్ కావాలంటే సంధ్యలో పడాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. ఇక పెద్ద హీరోల సినిమాలన్నీ మొదట సంధ్యలోనే పడాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పోటీ పడేవారు కూడా.

మెయిన్ సెంటర్ గా సంధ్య ఉండాల్సిందే

ఇక టాలీవుడ్‌లో ఏ పెద్ద హీరో సినిమా రిలీజైనా సంధ్య థియేటర్ లో ఖచ్చితంగా మెయిన్ సెంటర్ గా సంధ్య ఉండాల్సిందే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో మొదలై పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వరకు ప్రతి స్టార్ హీరో కెరీర్‌లోని ఇండస్ట్రీ హిట్లు, రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లకు సంధ్య ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోయింది.ముఖ్యంగా పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ ఇక్కడ 227 రోజులు ఆడి అప్పట్లో ఒక సంచలనం స్ప్రుష్టించింది.ఇక , ‘ఖుషి’ సినిమా సాధించిన వసూళ్లు అయితే అప్పట్లో ఒక చరిత్ర అని చెప్పకతప్పదు.

అలాగే సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సూర్య్తుడు రాకముందే వేలాది మంది అభిమానుల సందడి,డప్పుల చప్పుళ్ళు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం చూస్తే రిలీజ్ రోజు ఒక పండగ జరుగుతునట్టే ఉంటుంది.

ఒకే ఒక దిగ్గజ థియేటర్ సంధ్య థియేటర్

అయితే రోజులుగడుస్తున్న కొద్దీ ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాయమైపోయాయి. కాంపిటీషన్ తట్టుకోలేక చాలా మంది వాటిని కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మార్చేశారు. కానీ సంధ్య మాత్రం కాలానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ రావడం విశేషం.సెల్యులాయిడ్ ప్రొజెక్షన్ నుంచి డిజిటల్ కి మారడమే కాకుండా, కోవిడ్ తర్వాత అత్యాధునిక 4K ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకుని నేటితరానికి కూడా సరికొత్త అనుభూతిని అందిస్తోంది.

ALSO READ :‘రణబాలి’లో అంత మ్యాటర్ ఉందా.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే!

అయితే ఈ జర్నీలో  పుష్ప సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట వంటి చేదు సంఘటనలు కూడా దీని చరిత్రలో నిలిచిపోయాయి. అయినప్పటికీ, తెలుగు సిని ఇండస్ట్రీ ఎదుర్కొన్నమార్పును, మల్టీప్లెక్స్‌లని తట్టుకుని నిలబడిన ఒకే ఒక దిగ్గజ థియేటర్ సంధ్య థియేటర్ అని చెప్పకతప్పదు.

Tags

Related News

వాళ్లంతా క్రిమినల్స్.. డైరెక్టర్లపై రెచ్చిపోయిన కోన వెంకట్!

‘రణబాలి’లో అంత మ్యాటర్ ఉందా.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే!

రణబాలి కోసం విజయ్ రష్మిక రెమ్యూనరేషన్ ఎంతంటే?

‘బ్లడీ రోమియో’గా నాని..లుక్ టెస్ట్ పూర్తి.. అదిరిపోయిన లుక్

సత్య సాయిబాబా బయోపిక్ సినిమా చేయాలని ఉంది..కానీ: విజయ్ దేవరకొండ

నమ్మితే నట్టేట ముంచేశారు.. నిర్మాతకు దిమ్మతిరిగే షాక్!

మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలకు టికెట్ హైక్ ఉండదా?

Big Stories

Advertisement
×