E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులో మ‌ళ్లీ పెను ప్ర‌కంప‌న‌లు..PCBకి షాహిద్ అఫ్రిది హెచ్చ‌రిక !

పాకిస్తాన్ జ‌ట్టులో మ‌ళ్లీ పెను ప్ర‌కంప‌న‌లు..PCBకి షాహిద్ అఫ్రిది హెచ్చ‌రిక !
Advertisement

Shahid Afridi warns PCB: 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup ) కోసం ఇప్పటి నుంచే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తమ జట్టును బలంగా తయారు చేసేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తోంది. వన్డే ఫార్మాట్ తరహాలోనే ఇవాల్టి నుంచి మరో టోర్నమెంట్ కూడా ప్రారంభిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుపే ల‌క్ష్యంగా ప్లేయ‌ర్ల‌ను సిద్ధం చేసేందుకు ఈ టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే పాకిస్తాన్ వన్డే జట్టుకు కెప్టెన్ గా షాహిన్ అఫ్రిది కాకుండా బాబర్ ఆజం కొనసాగుతాడని జోరుగా వార్తలు కూడా వస్తున్నాయి. టెస్టుల్లో అద్భుతంగా జట్టును ముందుకు తీసుకు వెళ్తున్న నేపథ్యంలో బాబర్ ఆజంకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్ జ‌ట్టులో మ‌ళ్లీ పెను ప్ర‌కంప‌న‌లు..PCBకి షాహిద్ అఫ్రిది హెచ్చ‌రిక !

పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మార్పు ఉంటుందన్న వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో వెంటనే రియాక్ట్ అయ్యారు షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ పదవిని మార్చేది లేదని ఆగ్రహించారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా తన అల్లుడు షాహిన్ అఫ్రిదినే కొనసాగాలని డిమాండ్ చేశారు. లేకపోతే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యుల చిట్టా విప్పుతానని వార్నింగ్ ఇచ్చారు. తన అల్లుడు షాహిన్ అఫ్రిది ఆధ్వర్యంలోనే వన్డే వరల్డ్ కప్ పాకిస్తాన్ సొంతం చేసుకుంటుందని శపథం చేశారు. బాబర్ ఆజం ఒక్క టెస్ట్ గెలిపించగానే, హీరో కాడని పరువు తీశారు. వరుసగా టోర్నమెంట్లు గెలిపించాలని చురకలు అంటించారు. టెస్ట్ క్రికెట్ గురించి తనకు అవసరం లేదని… వన్డే వరల్డ్ కప్ వరకు తన అల్లుడు షాహిన్ అఫ్రిదిని వైట్ బాల్ క్రికెట్ కు కెప్టెన్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

2027 వన్డే వరల్డ్ కప్ వరకు నేనే కెప్టెన్ – షాహిన్ అఫ్రిది

పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్ కప్ ట్రోఫీ ప్రారంభ ఈవెంట్ సందర్భంగా వైట్ బాల్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది కీలక ప్రకటన చేశారు. తాను, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పాకిస్తాన్ కెప్టెన్ గా ఉంటానని తెలిపారు. ఇప్పట్లో వన్డే కెప్టెన్సీ మార్పు ఉండబోదని తెలిపారు. తన ఆధ్వర్యంలోనే వన్డే వరల్డ్ కప్ కు వెళ్తామని ప్రకటించేసుకున్నాడు షాహిన్ అఫ్రిది. అటు పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యులు మిస్బా ఉల్ హక్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. వైట్ బాల్ క్రికెట్ లో బాబర్ ఆజంకు కెప్టెన్సీ ఇస్తారన్న వార్తల్లో నిజం లేదన్నారు. అదంతా ఫేక్ అని తేల్చి చెప్పారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

 

Related News

1990 స‌మ‌యంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం

ఎవ‌డికి ఇచ్చేది లేదు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు నేనే కెప్టెన్‌

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

Big Stories

Advertisement
×