E-Paper
Advertisement

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!
Advertisement

Online Trading Scam: స్వేచ్ఛ బ్యూరో: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాల గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ, చదువుకుని సమాజంలో మంచి హోదాలో ఉన్న డాక్టర్లు కూడా వీటి బారిన పడటం నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు చెందిన ఒక డెంటల్ డాక్టర్ సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ. 14.61 కోట్లు పోగొట్టుకున్నారు.

పరిచయం వెనుక పక్కా ప్లాన్

Advertisement

కొంతకాలం క్రితం బాధితుడికి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘మోనికా’ అనే మహిళ పరిచయం అయ్యింది. మాటలతో నమ్మకం కుదిరిన తర్వాత, ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపింది. ఆమె పంపిన ఒక నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్ లింక్‌ను నమ్మి డాక్టర్ అందులో ఖాతా తెరిచారు.

అంకెలు చూపి నమ్మించారు

Advertisement

ప్రారంభంలో ఆయన చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టినప్పుడు, నకిలీ వెబ్‌సైట్ స్క్రీన్‌పై భారీగా లాభాలు వస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు చూపించారు. అది నిజమేనని నమ్మిన డాక్టర్, విడతల వారీగా పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయడం ప్రారంభించారు. ఒక దశలో ఆయన ఖాతాలో ఏకంగా రూ. 34 కోట్ల లాభం ఉన్నట్లు యాప్‌లో చూపించడంతో, డాక్టర్ తన సొంత ఇంటిని కూడా అమ్మేసి మొత్తం రూ. 14.61 కోట్లను ఆ అకౌంట్లలోకి మళ్లించారు.

తీరా విత్‌డ్రా చేద్దామంటే..

సమయానికి చేతిలో డబ్బులు లేక, యాప్‌లో కనిపిస్తున్న లాభాలను విత్‌డ్రా చేసుకుందామని డాక్టర్ ప్రయత్నించారు. అయితే సాంకేతిక సమస్యలు ఉన్నాయని, మరికొన్ని పన్నులు చెల్లిస్తేనే డబ్బు వస్తుందని మోసగాళ్లు ప్లేట్ తిప్పేశారు. ఎంత ప్రయత్నించినా రూపాయి కూడా చేతికి రాకపోవడంతో తాను దారుణంగా మోసపోయానని ఆయన గ్రహించారు. బాధితుడి ఫిర్యాదుతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలియని వ్యక్తులు పంపే ట్రేడింగ్ లింకులను నమ్మి జీవితాంతం కష్టపడి సంపాదించిన సొత్తును ఆవిరి చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!

Tags

Related News

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. రూ. 442 కోట్ల ఆస్తుల జప్తు!

సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మంత్రి పదవుల పంపకం.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ అరవింద్ సెటైర్లు!

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

Big Stories

Advertisement
×