E-Paper
Advertisement

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్
Advertisement

Big Tv Kissik Talks:  బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. ప్రతి వారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఇలా సెలబ్రెటీ టాక్ షోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రముఖ నటుడు మహేష్ అచంట(Mahesh Achanta) పాల్గొన్నారు. జబర్దస్త్ కమెడియన్ గా మొదలైన ఈయన ప్రయాణం ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఏమాత్రం తీరికలేకుండా గడుపుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు.

రామ్ చరణ్ స్నేహితుడిగా మహేష్ అచంట..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా మహేష్ అచంట తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడారు. రామ్ చరణ్ గారి గురించి కూడా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా కీలకపాత్ర పోషించారు. రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ ఈ సినిమా తరువాత రంగస్థలం మహేష్ గా మారిపోయారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీరేం చదువుకున్నారు అంటూ ప్రశ్న ఎదురవడంతో తాను ఎంబీఏ(MBA) చదువుకున్నానని మహేష్ తెలిపారు.

నిజంగానే ఎంబీఏ చదివావా?

Advertisement

తాను ఎంబీఏ చదివాను అనే విషయం ఎవరికైనా ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి చెప్పినా కూడా నమ్మరని మహేష్ తెలిపారు. ఇక రామ్ చరణ్ గారు కూడా ఈ విషయాన్ని అసలు నమ్మలేదని నువ్వు నిజంగానే ఎంబీఏ చేసావా? సందేహ పడ్డారని ఆ సమయంలో తాను ఎంబీఏ చేసినట్టు ఐడెంటిటీ కార్డు చూపించానని మహేష్ తెలిపారు. రామ్ చరణ్ గారికి ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటూ మరో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మహేష్ కి సమాధానం చెబుతూ నేను మాట్లాడే భాష అలా ఉంటుంది కాబట్టి రాంచరణ్ గారు కూడా నమ్మలేదని తెలిపారు.

Advertisement

ఇలా తాను ఎవరికైనా డబ్బులు ఇచ్చి నేను చదివాను అంటే కూడా నమ్మలేరు అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మహేష్ తన సినిమాల గురించి అలాగే రెమ్యూనరేషన్ వివరాల గురించి, అదేవిధంగా తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను తెలిపారు. అదేవిధంగా లవ్ బ్రేకప్స్ గురించి కూడా ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారని ప్రోమో వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఇక మహేష్ ఈ కార్యక్రమంలో ఎలాంటి అంశాలు గురించి ప్రస్తావించారనే పూర్తి వివరాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం అవుతుంది.

Also Read: రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

Related News

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

Big Stories

Advertisement
×