E-Paper
Advertisement

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కామెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్(Jabardasth) నుంచి వెండితెర సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న వారిలో నటుడు మహేష్ అచంట(Mahesh Achanta) ఒకరు. ప్రస్తుతం ఈయన వెండితెరపై వరుస సినిమా అవకాశాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇకపోతే మహేష్ ఆచంట తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదా..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈయన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడారు.. ఈ నేపథ్యంలోనే రెమ్యూనరేషన్ గురించి కూడా మహేష్ ఆచంట మాట్లాడారు. వరుస సినిమాలలో నటిస్తున్న మహేష్ ఎంతమేరా సంపాదించారు . హైదరాబాదులో సొంత ఇల్లు ,బాగా సెటిల్ అయ్యారా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మహేష్ సమాధానం చెబుతూ.. ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు నటించిన సెటిల్ అయ్యేది అంటుంది ఏమీ ఉండదని తెలిపారు మనకు ఇప్పుడు ఒక జబ్బు వచ్చిందంటే సంవత్సరం పాటు సంపాదించింది మొత్తం కరిగిపోతుందని తెలిపారు.

బ్రహ్మానందం గారి కొడుకు పాత్ర కోసం..

Advertisement

ఇక రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ తనకు హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యే అంత రెమ్యూనరేషన్ రాలేదని అప్పుడేప్పుడో రంగస్థలం సినిమా కోసం నేను ఎంత అయితే రెమ్యూనరేషన్ తీసుకున్నానో ఇప్పటికి కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని మహేష్ తెలిపారు. తనకు పెద్దగా రెమ్యూనరేషన్ పెంచలేదని ఉద్దేశంతోనే ఈయన ఈ మాటలు చెప్పారని తెలుస్తోంది. మరి తన రెమ్యూనరేషన్ ఎంత ఏంటి అనే వివరాలు పూర్తి ఎపిసోడ్ ప్రసారమయితే స్పష్టమవుతాయి. ఇక ఈయన సినిమా అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బ్రహ్మానందం గారి కొడుకు పాత్రలో అవకాశాలు వచ్చాయని తెలిపారు.

Advertisement

ఇలా బ్రహ్మానందం గారి కొడుకు పాత్ర కోసం పది రోజులు పనిచేయాల్సి ఉంటుందని, రోజుకు 1000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడంతో అమ్మకు ఒక 5000 పంపించి, నా ఖర్చులకు 5000 సరిపోతాయని భావించాను. ఒకరోజు షూటింగ్లో పాల్గొన్న తర్వాత మరుసటి రోజు ఒక ఫైట్స్ సన్ని వేషంలో భాగంగా నటించాల్సి వచ్చింది. అందులో తాను కింద పడ్డానని తద్వారా రేపటి నుంచి షూటింగ్ కు రావద్దంటూ  తనకు చెప్పారని మహేష్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

Related News

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

సోషల్ మీడియాలో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×