Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు మిస్టరీ కేసును చేధించేందుకు వైజయంతి రంగంలోకి దిగుతుంది అందులో భాగంగా ఫస్ట్ మనోహరని విచారిస్తుంది. వైజయంతి అడిగిన ప్రశ్నలకు మనోహరి భయపడుతూ ఏడుస్తూ.. సమాధానాలు ఇస్తుంది. మనోహరి ఇంటరాగేషన్ చేసిన తర్వాత సీతారాం గురించి అడిగి వెళ్లిపోతుంది. వైజయంతి వెళ్లిపోయాక మనోహరి, అమర్‌తో కలిసి హాస్పిటల్‌లో కూర్చుని ఏడుస్తుంది. వైజయంతి తానేదో తప్పు చేసినట్టు ప్రశ్నించిందని బాధపడ్డట్టు నటిస్తుంది. అందుకు అమర్ అదంతా మామూలేనని పోలీసులు ఎంక్వైరీ చేయడంలో భాగంగానే నిన్ను ప్రశ్నించారని నువ్వు నిజమే చెప్పావు కదా నీకెందుకు భయం అంటాడు.
మనోహరి మాత్రం అది కాదు అమర్ ప్రేమించి ఇష్టంతో పెళ్లి చేసుకున్న పార్థును నేను చంపుకుంటానా..? నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పేదాన్ని కదా అంటూ ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అదే హాస్పిటల్‌లో రిసెప్షన్‌లో ఉన్న మిస్సమ్మ, రాథోడ్‌తో బాధపడుతుంది. మనోహరి ఏం చేయాలో అర్థం కావడం లేదు పెళ్లి చేసుకున్న పార్థునే చంపి ఏమీ ఎరుగనట్టు నటిస్తుంది అంటూ కోప్పడుతుంది. రాథోడ్ మాత్రం ఇప్పటికైనా నిజం చెప్పు మిస్సమ్మ. మనోహరి గురించి అమర్ సార్‌కు నిజం తెలిస్తే ఆ మనోహరి తాట తీస్తారు అంటే మనోహరి మౌనంగా ఉండిపోతుంది. అయ్యో మీరేమో నిజం చెప్పరు.. మనోహరి మాత్రం చేయాల్సినవి చేస్తూనే పోతుంది అంటాడు. తన పక్కనే కూర్చుని ఏడుస్తున్న మనోహరిని అమర్ ఓదారుస్తుంటాడు.
పార్థు, మనోహరి కులుమనాలిలో స్టే చేసిన హోటల్ సీసీటీవీ పుటేజీ చూస్తుంది వైజయంతి. తర్వాత హోటల్ రిసెప్షనిస్ట్‌ను ఎంక్వైరీ చేస్తుంది. అతను జరిగింది మొత్తం చెప్తాడు. రాత్రి మేడంకు ఫీవర్‌గా ఉందని టాబ్లెట్ అడిగారు పార్థు సార్. మా సీతారాం తీసుకెళ్లి ఇచ్చారు. అయితే సైట్ సీయింగ్‌కు నడుచుకుంటూ వెళ్దామని మేడం చెప్పారట. జ్వరంలో అంత దూరం నడుచుకుంటూ వెళ్లలేరని కారులో వెళ్తేనే బాగుంటుందని సీతారాం చెబితే మనోహరి మేడం తిట్టారట అంటూ చెప్పగానే.. అవునా జ్వరంతో సైట్ సీయింగ్‌కు ఎలా వెళ్లారు అని వైజయంతి అనుమానిస్తుంది. తర్వాత ఆ వ్యక్తికి ఇంకా ఏదైనా గుర్తుకు వస్తే వచ్చి చెప్పమని పంపించేస్తుంది.
ఇక సీతారాం బతికితే తనకు ప్రమాదం అని మనోహరి ఆలోచిస్తుంది. ఎలాగైనా సీతారాం ను కూడా చంపేయాలని ప్లాన్ చేస్తుంది. రాత్రికి అందరూ పడుకున్నాక ఐసీయూలోకి వెళ్లి ఆక్సిజన్ తీసేయాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే అందరూ పడుకున్నాక మనోహరి మెల్లగా ఐసీయూ వైపు వెళ్తుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ, మిస్సమ్మ నిద్రపోయారని కన్ఫం చేసుకున్నాక ఐసీయూలోకి వెళ్తుంది. వెళ్తూ అక్కడ ఉన్న టేబుల్‌ను తగులుతుంది. టేబుల్ కింద పడగానే.. బయట ఉన్న సెక్యూరిటీ లేచి లోపలికి వెళ్లి చూస్తాడు.
మనోహరి కర్టెన్ వెనక దాక్కుంటుంది. సెక్యూరిటీ వెళ్లిపోయాక సీతారాంకు ఉన్న ఆక్సిజన్ తీసేస్తుంది. వెంటనే సీతారాం కళ్లు తెరచి మనోహరిని చూస్తుంటాడు. మనోహరి షాక్ అవుతుంది. ఆక్సీజన్ తీసేస్తే చచ్చిపోతావనుకుంటే కళ్లు తెరచి చూస్తున్నావా..? అనుకుంటూ పక్కనే ఉన్న దిండు తీసుకుని సీతారాంను చంపేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే బయట వైజయంతి వస్తుంది. కారు సౌండ్ విని మనోహరి ఐసీయూలోంచి బయటకు పరుగెడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.