E-Paper
Advertisement

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?
Advertisement

Anganwadi Holidays: స్వేచ్చ బ్యూరో: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఈనెల10 నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 22 నుంచి..

సెలవుల కాలంలో లబ్ధిదారులకు సాధారణంగా అందించే వేడి భోజనం (హాట్‌ కుక్‌డ్‌ మీల్‌)కు బదులుగా టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్ఆర్) పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయి. ఈ మేరకు తమ పరిధిలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, హెల్పర్లకు అవసరమైన సూచనలు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులు, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులును శాఖ ఆదేశించింది.

Advertisement

Also read: మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

మొదటిసారిగా దసరా సెలవులు..

ప్రభుత్వ స్కూల్ టీచర్ల మాదిరిగానే తమకు బతుకమ్మ, దసరా సెలవులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీ చరిత్రలోనే మొదటిసారిగా దసరా సెలవులు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ ని హెల్పర్స్ ని బతుకమ్మ సంబరాలు సంబరంగా చేసుకోమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Also read: సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

Tags

Related News

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

Big Stories

Advertisement
×