Big Tv Kissik Talks: బిగ్ టీవీ(Big Tv) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా ఈ వారం జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య రావు (Sowmya Rao)హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఒకరిని తొక్కుకుంటూ పోవాలి. ఇది జగమెరిగిన సత్యం. ఇదివరకే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. సౌమ్య రావు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.
జబర్దస్త్ యాంకర్ గా సందడి చేసిన సౌమ్యరావు..
సౌమ్య రావు కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో సీరియల్స్ అవకాశాలను అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తున్న సౌమ్యరావు జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ యాంకర్ గా తప్పుకోవడంతో ఈమె యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ కొన్ని విమర్శలను ఎదుర్కొన్న తన మాటతీరుతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సౌమ్యరావు అనుకొని విధంగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇలా జబర్దస్త్(Jabardasth) నుంచి తప్పుకొని ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే ఈ టీవీలో ప్రసారమవుతున్న ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
ఇండస్ట్రీలో సిండికేట్ పాతుకుపోయింది…
తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హాజరైన ఈమెకు వర్ష ప్రశ్నిస్తూ.. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారని అడిగారు. ప్రస్తుతం అయితే తాను ఢీ కార్యక్రమాన్ని చేస్తున్నారని అయితే తనని నమ్మి ఎవరు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపారు. సౌమ్యరావు చేసిన ఈ వ్యాఖ్యలతో వర్ష షాక్ అయ్యారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేసిన మిమ్మల్ని నమ్మకపోవడం ఏంటి? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సౌమ్యరావు సమాధానం చెబుతూ ఇండస్ట్రీలో ఉదయభాను (Udaya Bhanu)గారు చెప్పినట్టు సిండికేట్(Syndicate) బాగా పెరిగిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనని ప్రోత్సహించే వారి కంటే కూడా తనకు వచ్చిన అవకాశాలను తొక్కేసే వారే ఎక్కువగా ఉన్నారని, ఉదయభాను గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో సిండికేట్ ఉందని వెల్లడించారు.
తెలిసినవారే తొక్కేశారు…
ఇక ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందేనని తెలిపారు. అయితే తనకు బాగా తెలిసిన వారే అవకాశాలు లేకుండా చేశారని సౌమ్యరావు తెలిపారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది మంచి పొజిషన్ వచ్చిన తరువాత యాటిట్యూడ్ చూపిస్తుంటారు. అది సరైన పద్ధతి కాదని అలాగే స్టార్ డం ఉన్న వారిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు అలా ఆరాధించడం కూడా తప్పని తెలిపారు. మనం ఆరాధించాల్సింది ఒక దేవుడిని మాత్రమే తప్ప, మరెవరిని కాదని ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు జరిగిన కొన్ని సంఘటనలు గురించి సౌమ్యరావు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Nithin -Shalini: కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు.. కొత్తగా ఉందే?