మందు వేస్తే చాలామందికి మాట తడబడుతుంది, డోసు ఇంకాస్త ఎక్కువైతే నడక కూడా తడబడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అలాగే తాగి ఊగినట్టు కనిపించాడు. మిగతా సందర్భాల్లో ఓకే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని ఆహ్వానించేందుకు వెళ్లిన ఆయన ఇలా తడబడుతూ కెమెరాల కంటికి చిక్కి నవ్వులపాలయ్యాడు. ఇంతకీ ట్రంప్ జిగ్ జాగ్ వాకింగ్ కి కారణం ఏంటి? ఆయన మందేశాడా, మరింకేదైనా జరిగిందా? సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు, ఆయన వీడియో వైరల్ అవుతున్నాయి.
Trump couldn’t even walk in a straight line to greet Putin; stumbling like a man who just met gravity for the first time.
World stage, red carpet, and he’s out here looking like a malfunctioning Roomba. pic.twitter.com/wVyk0vSLuW
— Brian Allen (@allenanalysis) August 15, 2025
అంతపని చేశాడా..?
ప్రముఖ వ్యక్తులు మందుతాగి కెమెరాలకు చిక్కితే అది వైరల్ వీడియో అవుతుంది. అందులోనూ అమెరికా అధ్యక్షుడు, అది కూడా రష్యా అధ్యక్షుడితో భేటీకి ముందు ఇలా తడబడుతూ కనపడితే ఆ వీడియో ఇంకెంత వైరల్ అవుతుందో చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారంతా ట్రంప్ ఫుల్లుగా మందుకొట్టాడనే అంటున్నారు. మరిన్ని వింతైన వ్యాఖ్యానాలు కూడా జోడిస్తున్నారు. పుతిన్ ను పలకరించడానికి వెళ్తున్న ట్రంప్ కనీసం ఒక సరళ రేఖా మార్గంలో కూడా నడవలేకపోయాడని అంటున్నారు. మొదటిసారి గురుత్వాకర్షణను ఎదుర్కొన్న వ్యక్తి ఎలా ఉంటాడో, ట్రంప్ అలా ప్రవర్తించాడని మరికొందరు అన్నారు. స్నైపర్ల కాల్పులను తప్పించుకునే వ్యక్తులు ఎలా నడుస్తారో, ట్రంప్ కూడా అలాగే ప్రవర్తించాడని మరొకరు కామెంట్ పెట్టారు. ఇలాంటి సందర్భాల్లో ట్రంప్ ముందు కార్పెట్ ఉంటేనే మంచిది, లేకపోతే సరిహద్దులు కనిపించక అతను మరింత వంకర టింకరగా నడుస్తాడంటూ చమత్కరించారు. విమానం దిగినప్పుడు నేను కూడా రెండు నిమిషాలు భయంకరంగా నడుస్తాను.. మా లాంటి వృద్ధులకు ఇది సర్వ సాధారణం అంటో ఓ వ్యక్తి ట్రంప్ ఏజ్ పై కౌంటర్ వేశాడు. కొంతమంది ట్రంప్ అభిమానులు మాత్రం ఈ వీడియోని ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ట్రంప్ ని విమర్శించేందుకు ఎవరో దీన్ని తయారు చేశారని అన్నారు.
ఆరోగ్యం బాగోలేదా..?
మందు తాగాడన్న విషయం పక్కనపెడితే అసలు ట్రంప్ అలా ఎందుకు నడిచాడని చాలామంది ఆరా తీస్తున్నారు. ట్రంప్ కి ఆరోగ్యం బాగోలేదని, ఆయనకు సిరల వ్యాధి ఉంది కాబట్టి అలా నడిచి ఉంటారని కొంతమంది చెబుతున్నారు. సిరల వ్యాధితో కొంతకాలంగా ట్రంప్ బాధపడుతున్న విషయం తెలిసిందే. శరీర భాగాలనుంచి గుండెకు రక్త సరఫరా సరిగా లేకపోవడమే ఈ వ్యాధి లక్షణం. దీనివల్ల చీలమండలు, కాళ్లు, చేతులు వాచిపోయి కనపడతాయి. ఈ సమస్య వల్లే ట్రంప్ సరిగా నడవలేకపోయి ఉంటారని కొందరు సింపతీ చూపెడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోయినా ఆయన ప్రపంచ శాంతికోసం పాటుపడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో కూడా పుతిన్ తో భేటీకోసం వచ్చారని అంటున్నారు. ట్రంప్ నడకకు కారణం ఏదయినా… ఆయన వీడియోలు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ వీడియోలను షేర్ చేస్తూ ఆయన్ని ఓ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. అయితే ట్రంప్ పై ఇలాంటి విమర్శలు, సెటైర్లు చాలా కామన్ అనే చెప్పాలి. ఆయన వీటిల్ని అస్సలు పట్టించుకోరనేది ఆయన్ను దగ్గరగా చూసినవారు చెప్పే మాట.