E-Paper
Advertisement

హీటెక్కిన నామినేషన్.. మళ్లీ నోరు జారిన రోహిత్..ఈ వారం?

హీటెక్కిన నామినేషన్.. మళ్లీ నోరు జారిన రోహిత్..ఈ వారం?
Advertisement

Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న బిగ్ బాస్ ఎట్టకేలకు పదవ సీజన్ అప్పుడే 5 వారాలు పూర్తిచేసుకుంది. ఇక ఐదు వారాలలో ఏకంగా 6 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం చైత్ర, రెండవ వారం కృష్ణుడు, మూడవ వారం మిథిలేష్ రెడ్డి సెల్ఫ్ ఎలిమినేట్ కాగా, నాలుగవ వారం సృష్టి , ఐదవ వారం చరణ్, అపూర్వ ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే అపూర్వది అన్ ఫేర్ ఎలిమినేషన్ అని ఒకపక్క వినిపిస్తుంటే ..శాలిని నీ సేవ్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటి ?అసలు ఆమె ఆట ఎక్కడ ఆడుతోంది? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

హీటెక్కిన నామినేషన్ వార్..

ఇదంతా పక్కన పెడితే.. 36వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో నామినేషన్ ప్రక్రియ బాగా హీటెక్కించింది.ఉదయం విడుదల చేసిన ప్రోమోలో పప్పు దగ్గర గొడవపడ్డ రోహిత్.. ఇప్పుడు వంశీని నామినేట్ చేసే సమయంలో మళ్ళీ నోరు జాడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రోడ్ బ్లాక్..

Advertisement

తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ మాట్లాడుతూ..” వైల్డ్ ఫైర్స్ రాకతో నా తొలి అవతారం ‘రోడ్డు బ్లాక్’ అంటూ కొత్త టాస్క్ నిర్వహించారు. నామినేషన్ పవర్ కోసం ఇద్దరు కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డ్స్ ఎంపిక చేస్తారు” అంటూ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అందులో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన శివ్.. త్రిగుణ్, రోహిత్ లను ఎంపిక చేసి నామినేషన్ పవర్ ను పొందే టాస్క్ నిర్వహించార. అందులో రోహిత్ విజేతగా నిలిచారు.

also read:బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

మళ్లీ నోరు జారిన రోహిత్..

Advertisement

రోహిత్ మాట్లాడుతూ..” నా ఫస్ట్ నామినేషన్ వంశీ.. మీరు మీ తెలివినంత ఉపయోగించి అని చెబుతుండగానే.. నా తెలివినంతా ఉపయోగించడానికి ఏముంది అని వంశీ చెబుతుండగానే.. అది నా వర్షన్ డైలాగ్ అండి అంటూ కోపంతో ఊగిపోయారు రోహిత్. మీరు స్క్రిప్ట్ ఇస్తారా? ఏం మాట్లాడాలో నాకు అంటూ మండిపడ్డాడు. స్క్రిప్ట్ ఇచ్చేంత అర్హత నాకు లేదు అని వంశీ చెబుతుండగానే.. రోహిత్ నీ ఆట నాకసలు కనిపించట్లేదు.. ఇక ఎప్పుడూ కనిపించదు అంటూ రోహిత్ చెబుతాడు. ఇప్పుడు కనిపిస్తుంది.. బయటకి వెళ్ళాక అంటూ వంశీ తన అభిప్రాయాన్ని చెప్పారు.

హోస్ట్ చేతుల్లో మళ్లీ తిప్పలు తప్పవా?

నేను బయటకి వెళ్ళాక అంటే నేను కప్పు తీసుకునే బయటకు వెళ్తాను.. అప్పుడు మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఆడుకోండి అంటూ రోహిత్ అంటాడు. ఇక వంశీ మాట్లాడుతూ.. నువ్వు ఆ కప్పే సరిగ్గా కడగవు అంటుంటే.. రోహిత్..” త్రిగుణ్ తో నా బిహేవియర్ ఎందుకు మారింది? మీతో ఎందుకు మారట్లేదు అనేది మీ ఇంగితానికి వదిలేస్తున్నాను” అంటూ నోరు జారారు రోహిత్. ఇక వంశీ “జ్ఞానం లేనోడు చెబితే నేనెందుకు వింటాను” అంటూ అలా ఇద్దరి మధ్య నామినేషన్ వార్ వేడెక్కింది. అలా మొత్తానికి వంశీ నామినేట్ చేయబడ్డాడు. ఇకపోతే రోహిత్ మళ్లీమళ్లీ నోరు జారుతుండడంతో ఈ వారం హోస్ట్ నాగార్జున చేతిలో బలైపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్.

Related News

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Big Stories

Advertisement
×