E-Paper
Advertisement

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదు

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదు
Advertisement

Krishnamachari Srikkanth On Sanju Samson Failures:  టీమిండియా వర్సెస్ విండీస్ జట్ల మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్ నేపథ్యంలో సంజు శాంసన్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజు శాంసన్ బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారిందంటూ పరువు తీశారు. అతని బ్యాటింగ్ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదంటూ టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను ముందు నుంచి వైభవ్ సూర్యవంశీని ఆడించాలని కోరుతున్నట్టు వ్యాఖ్యానించారు. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ ను ఆడిస్తే, మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. కానీ ఇది వినకుండా గౌతమ్ గంభీర్ తలతిక్క పనులు చేస్తున్నాడని ఆగ్రహించారు. ఇప్పటికైనా మిగిలిన రెండు టీ20ల్లో సంజు శాంసన్ ను పక్కకు పడేసి, వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదంటూ

టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అతనికి అవకాశాలే తక్కువ వస్తూంటాయి. వచ్చిన చాన్సులను మనోడు వాడుకోవడం అంతంత మాత్రంగానే ఉంటోంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇరగదీసిన సంజు శాంసన్, ఆ తర్వాత బాగా ఆడిన సందర్భంగా పెద్దగా లేవు. మొన్న విండీస్ తో జరిగిన తొలి టీ20లో ఫస్ట్ డౌన్ లో వచ్చి, విఫలమయ్యాడు. రెండో టీ20లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఇండోర్ టీ20లో మళ్లీ చేతులెత్తేశాడు. ఇలానే అతని కెరీర్ అప్ అండ్ డౌన్ అవుతోందని బాంబ్ పేల్చారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే, సంజు శాంసన్ ను పర్మినెంట్ గా పక్కకు పెట్టే ప్రమాదం ఉంది.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

ఇదే విషయాన్ని తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశారు. సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదంటూ పరువు తీశారు. సంజు శాంసన్ స్థిరంగా మంచి రన్స్ చేయకపోతే, బయటకు పడేస్తారని హెచ్చరించారు. ఇక పరుగులు చేయడం చేతకాకపోతే, ఇంట్లో కూర్చోవాలని కూడా కౌంటర్ ఇచ్చారు. సంజు శాంసన్ తప్పుకుంటే, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రేసులోకి వస్తాడని తెలిపారు. చాలా మంది అనవసరంగా సంజు శాంసన్ ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారని మండిపడ్డారు. కానీ తన దృష్టిలో సంజు కంటే వైభవ్ ది బెస్ట్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైభవ్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే తాను చెబుతానన్నారు. దీంతో సంజుపై కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా, 1(2), 27(15), 10(7), 57(22), 50(35), 9(7), 7(9), 2(4), 11(9), 82(41), 3(6)గా సంజు ఆడిన గత 11 ఇన్నింగ్స్‌లు ఉన్నాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

Related News

టీమిండియాలో సిక్స్ ప్యాక్ యుగం న‌డుస్తోంది.. వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు

అందరూ ద‌ద్ద‌మ్మ‌లే.. ప‌ర్స‌న‌ల్ రికార్డుల కోస‌మే ఆడి, పాకిస్తాన్ కొంప‌ముంచుతున్నారు

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి..సిక్సుల వ‌ర్షమే

గంభీర్, శ్రేయాస్ అయ్య‌ర్ మ‌ధ్య విభేదాలు…న‌మ‌న్ ధీర్ వ‌ద్దేవద్దంటూ గొడ‌వ‌ !

స్కూల్ కు వెళ్లే పిల్లాడివా? తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్‌

మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులతో పాకిస్తాన్ కంపుకొడుతోంది

Big Stories

Advertisement
×