Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన తెలుగు సీజన్ 10 ఆ తర్వాత అనూహ్యంగా చైత్ర, కృష్ణుడు, సృష్టి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ సూట్ కేస్ ఆఫర్ ను తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదవ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కి నామినేషన్ చాలా గట్టిగానే జరిగాయి. సోమవారం జరిగిన హోరాహోరీ నామినేషన్ పోరులో ఏకంగా ఈసారి 7మంది నామినేషన్స్ లోకి వచ్చారు.
ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగింది. కంటెస్టెంట్లు ఒకరి తప్పులను మరొకరు చెబుతూ మాటల యుద్ధానికి దిగారు. రోహిత్, అపూర్వ, ముఖేష్, వర్షిణి మధ్య ఎక్కువగా సంభాషణలు జరిగినట్టు ఈ ప్రోమోలో చూస్తే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అపూర్వ , త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. మధ్యలో ముఖేష్, వర్షిణిల పేర్లను కూడా అపూర్వ తీసినట్టు నామినేషన్ లో చూడవచ్చు. మొత్తానికి అయితే ఐదవ వారం నామినేషన్ కూడా చాలా హోరాహోరీ గానే జరిగినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లో త్రిగుణ్ , రోహిత్, అమన్ , షాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయ్యారు.
ఇకపోతే నాలుగవ వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే కామెంట్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఐదవ వారం ఈ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని, ఇద్దరిని హౌస్ నుండి పంపించేసి, మరో ఇద్దరిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకురాబోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉంటుందని, అందులో భాగంగానే ఐదవ వారం నామినేషన్ లిస్టులో చరణ్, షాలిని డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి మొదటి వారమే ఎలిమినేట్ అయిన చరణ్, ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ హౌస్ లోకి వచ్చాడు.
also read:400 కోట్ల కలెక్షన్స్ ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..ఎలా ఉందంటే?
మాటలు తప్పితే ఆట లేదనే విమర్శలు వస్తున్నాయి. తక్కువ ఓటింగ్ ఉన్న చరణ్ నాల్గవ వారమే ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ తృటిలో మిస్ అయ్యి సృష్టి బలయింది. ఇక షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతవారం ఎలిమినేషన్ లో సృష్టితో పోటీపడింది. ఈ వారం సత్తా చాటకుంటే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ ను వీడాల్సిందే అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా డేంజర్ జోన్ లో ఆ ఉన్న ఇద్దరు మళ్లీ సేఫ్ జోన్ లోకి వస్తారా? లేదా అన్నది వీకెండ్స్ వరకు ఎదురు చూడాల్సిందే.