Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 10 అప్పుడే 5 వారాలు పూర్తి చేసుకుంది. ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్ వార్ ఎంత గట్టిగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరికొకరు నువ్వేంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో పోటీ పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ ఆరవ వారం ఎలిమినేషన్ దిశగా ఎవరు అడుగులు వేయబోతున్నారు? అసలు ఎంతమంది నామినేట్ అయ్యారు ? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఇకపోతే హోరా హోరీగా సాగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం 6 మంది నామినేట్ అయ్యారు. అమన్, వంశీ, వర్షిని, శాలిని, రోహిత్, రాంప్రసాద్ మొత్తం 6 మంది ఈ వారం నామినేట్ అయ్యారు. ఇకపోతే ఇక్కడ ఉన్నది అందరూ తోపులే .. టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్సే కావడంతో అసలు ఎవరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
also read:400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ఇకపోతే శాలిని, రోహిత్ మధ్య లవ్ ట్రాక్ అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శాలిని నామినేషన్ లోకి రోహిత్ వచ్చి గొడవపడడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కప్పు దిశగా అడుగులు వేయాల్సిన రోహిత్.. శాలిని వెంటపడడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. ఇక ఈవారం శాలిని ను ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ ను బండ బూతులు తిడుతూ సైగలు చేస్తూ కించపరిచిన నేపథ్యంలో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చేశారు. గెట్ అవుట్ అంటూ డోర్స్ కూడా తెరిచారు. కానీ తప్పు అని క్షమాపణలు కోరుకున్నారు రోహిత్. అంతేకాదు కెప్టెన్ సుధీర్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అటు త్రిగుణ్ తో నోరు జారడం లాంటి విషయాలు కూడా రోహిత్ ఎలిమినేషన్ దిశగా అడుగులు వేయిస్తున్నాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ వ్యక్తి ఎవరో ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇదిలా ఉండగా ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అపూర్వ, చరణ్ లాంటి కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. నిజానికి రెండవ అవకాశం ఇచ్చినా.. చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయారు. అటు అపూర్వ కూడా
గేమ్లో 100% ఎఫర్ట్ పెడుతోంది. కానీ ఎక్కువగా అరుస్తోంది అనే కారణంతోనే ఈమెను హౌస్ నుంచి పంపించేశారనే కామెంట్లు కూడా వినిపించాయి. పైగా శాలినినీ సేఫ్ చేయడానికి ఈమెను హౌస్ నుంచి పంపించేశారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరొకవైపు అదే ఐదవ వారం ఏకంగా 5 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. నటరాజ్ మాస్టర్ భార్య నీతూ, దీక్ష గుత్తికొండ, రామకృష్ణ ఆర్కే, శివ్, శ్వేతా నాయుడు ఇలా 5 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. మరి వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ కంటెస్టెంట్స్ మధ్య పోరు ఏ విధంగా సాగనుందో చూడాలి.