Bigg Boss 10 Agnipariksha : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ రేటింగ్ సీరియల్స్ వాళ్ళు ముందుగా గుర్తుకు వచ్చే రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికి 9 సీజన్లు పూర్తి చేసుకుని పదవ సీజన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ సీజన్ కి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.. ఈ సీజన్ ప్రారంభమవుతుంది అన్నప్పటినుంచి కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక అగ్ని పరీక్ష సీజన్ 2 కోసం జనాలు ఈగరుగా వెయిట్ చేస్తున్నారని విషయం తెలిసిందే.. ఇక కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది. గతంలో వచ్చిన అగ్నిపరీక్ష రోజు సెలక్ట్ అయిన వాళ్లు ఈ సీజన్లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.. ఈసారి అగ్నిపరీక్షకు రాబోతున్న కంటెస్టెంట్ లో పేర్లు కూడా కాస్త వెరైటీగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. బిగ్ బాస్అగ్ని పరీక్షలు ఓల్డ్ కంటిస్టెంట్లు కూడా రాబోతున్నట్లు ఓ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఎవరు ఇంటర్వ్యూ బోతున్నారు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం…
అగ్ని పరీక్షకు ఉప్పల్ బాలు కూడా వచ్చాడని తెలుస్తోంది. అతను మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి వస్తే ఆడియెన్స్ మాత్రం షాక్ అవుతారు. ఇక వీళ్ళల్లో ఒక మహిళ రైతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక ఇటీవల రీల్స్ చేస్తూ వైరులైన ఒక టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. ఆమె తన ఉద్యోగానికి రిజైన్ చేయడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 70 మందిని వడబోసి.. చివరకు ఐదారు మందిని సెలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. గత సీజన్‌లో నవదీప్, బిందు మాధవి, అభిజిత్ కలిసి అగ్ని పరీక్షను నడిపించిన సంగతి తెలిసిందే.. మరి ఈ సీజన్ లో ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నది చెప్పలేం. ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.
బిగ్బాస్ హౌస్ లోకి ఈసారి సెలబ్రిటీగా వచ్చే వాళ్ల గురించి తెలుసుకునేందుకు జనాలు ఎక్కువగా ఆత్రుత కనబరుస్తున్నారు. ఎలాంటి సెలబ్రిటీలు హౌస్ లోకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు అని ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి, హరి, ఆషిక, నిఖిల్, శ్రవణ్, సుమిత్, యాదమ్మ రాజు, దీపిక రంగరాజు వంటి వారిని ఈ పదో సీజన్‌కు సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షో లో కనిపించే సెలబ్రిటీల్ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్ కాస్త కఠినంగా ఉండబోతుంది అని నాగర్జున ప్రకటించారు. సెప్టెంబర్ 6న బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతుంది. మరి ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్ ల మధ్య లవ్ ఎఫైర్ కొనసాగుతుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.