The Paradise Mohan Babu:శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని (Nani,) హీరోగా మరోసారి నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘దసరా’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్యారడైజ్ సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు రాఘవ్ జయల్, మోహన్ బాబు లాంటి స్టార్ సెలబ్రిటీలు కీలకపాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు మరింత తారస్థాయికి చేరాయనే చెప్పాలి. సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్ర బృందం.
ఇదిలా ఉండగా మరొకవైపు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు ది ప్యారడైజ్ సినిమాలో తన పాత్ర పై చేసిన కామెంట్లు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసాయి. తాజాగా కాలేజీ ఈవెంట్లో పాల్గొని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మోహన్ బాబు కాలేజ్ ఈవెంట్ లో భాగంగా ది ప్యారడైజ్ సినిమా గురించి ప్రస్తావించడంతో ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాలేజ్ ఈవెంట్లో విద్యార్థులను ఉద్దేశించి మోహన్ బాబు మాట్లాడుతుండగానే ప్యారడైజ్ అనే పదాన్ని ఆయన ప్రస్తావించడంతో.. సభలో ఉన్న విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఈ చప్పట్లు కేరింతలన్నీ తాను నటించిన సినిమా కోసమేనని గ్రహించిన మోహన్ బాబు ఈ సినిమాలో తన పాత్ర గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మోహన్ బాబు మాట్లాడుతూ..” ది ప్యారడైజ్ సినిమాలో నా పాత్ర చూస్తే మీరు నా దగ్గర కూడా రారు.. అంత భయంకరమైన క్యారెక్టర్ నాది” అంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి . కలెక్షన్ కింగ్ గా, క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మోహన్ బాబు ఇప్పుడు అతి భయంకరమైన పాత్రలో తాను నటించబోతున్నాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు . మోహన్ బాబు మాటలను బట్టి చూస్తే ఆయన పాత్ర తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందో.. అది ప్రేక్షకులను ఏ రేంజ్ లో భయపెట్టబోతుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి అయితే గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ బాబు మళ్లీ తన పాత క్యారెక్టర్ ను మించేలా ఒక భయంకరమైన నెగిటివ్ రోల్ పోషిస్తున్నాను అని చెప్పడం నిజంగా క్యూరియాసిటీని పెంచేసింది. మొత్తానికి అయితే ఈ సినిమాతో మళ్ళీ మోహన్ బాబు తన పాత విశ్వరూపాన్ని చూపించబోతున్నారన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.
also read: డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్
ది ప్యారడైజ్ సినిమా విషయానికొస్తే కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాఘవ్ జుయల్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మోహన్ బాబు షికాంజ మాలిక్ అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా శుభానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.