Hasan Nawaz: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (ASIAN GAMES 2026) నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓ అద్భుతమైన ఆటగాడు దొరికాడు. మిడిల్ ఆర్డర్ లో ఇరగదీస్తూ, ప్రత్యర్థులను హసన్ నవాజ్ తుక్కురేగ్గొడుతున్నాడు. తాజాగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య జరిగిన ఫైనల్స్ సందర్భంగా కూడా 51 బంతులు ఎదుర్కొన్న హసన్ నవాజ్ (Hasan Nawaz), ఏకంగా 96 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 5 బౌండరీలు ఉన్నాయి. 188.24 స్ట్రైక్ రేట్ తో మనోడు ఇరగదీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్, సుందర్ అందరి బౌలింగ్ లోనూ ఊచకోత కోశాడు. చివరి వరకు నిలబడి, టీమిండియాకు ముచ్చెమటలు పట్టించాడు. కానీ అతనికి సరైన సపోర్ట్ గా మరో బ్యాటర్ లేకపోవడం, ఆస్కింగ్ రేట్ పెరిగిపోవడంతో మ్యాచ్ ఓడిపోయింది పాక్. లేకుంటే టీమిండియాను ఓడించి, పాకిస్తాన్ కు గోల్డ్ మెడల్ అందించేవాడు. ఈ తరుణంలో హసన్ నవాజ్ పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్స్ సందర్భంగా 96 పరుగులతో ఇరగదీసిన హసన్ నవాజ్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందినవాడు. తన కెరీర్ ప్రారంభంలో లేప్ బాల్ క్రికెట్ ట్రైనర్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత లెదర్ బాల్ క్రికెట్ వైపు అడుగులు వేశాడు. 2002లో ఆ పేద కుటుంబంలో జన్మించిన హసన్ నవాజ్, పెద్ద హిట్టర్. 200లకు పైగా స్ట్రైక్ రేట్ తో సిక్సులు, బౌండరీలు కొడతాడు.
2025లోనే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ టీమ్స్ మధ్య జరిగిన టీ20లోనే హసన్ నవాజ్ అరంగేట్రం చేశాడు. తన మూడో మ్యాచ్ లో 45 బంతుల్లోనే సెంచరీ చేసి.. దుమ్ములేపాడు. అంతేకాదు, అతి పిన్న వయస్సులో టీ20 సెంచరీ చేసిన పాక్ ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇస్లామాబాద్, క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడి, ఎన్నో పరుగులు సాధించాడు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో హసన్ నవాజ్ రెండు, మూడు మ్యాచ్ లలో విఫలమయ్యాడు. దీంతో అతడిని పక్కకు పెట్టారు. కానీ ఏషియన్ గేమ్స్ 2026 సందర్భంగా హసన్ నవాజ్ ను పరీక్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులోకి తీసుకుంది. దానికి తగ్గట్టుగానే నవాజ్ హిట్ అయ్యాడు. మరి ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (ASIAN GAMES 2026) నేపథ్యంలో బాగా ఆడిన నవాజ్ కు ఇకపై వరుసగా ఛాన్సులు ఇస్తారా ? లేక పక్కకు పెడతారా ? అనే చర్చ మొదలైంది.
WHAT A KNOCK FROM HASSAN NAWAZ! 🇵🇰
96 runs off just 52 balls against India in the Asian Games final! 🏏💥 pic.twitter.com/dvInF7rneM
— Rehan 56 (@imrehan056) October 3, 2026