Bigg Boss 10 Mithilesh: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మూడు వారాలను పూర్తి చేసుకుంది మూడవ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించిన ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ పంపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కామనర్ మిథిలేష్ రెడ్డి(Mithilesh Reddy) హౌస్ లోకి అడుగు పెట్టారు.
ఇలా ఈయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. ఈ వీకెండ్ లో భాగంగా బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. హౌస్ నుంచి కంటెస్టెంట్లు ఎవరైనా బయటకు రావాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చని అందుకుగాను 15 లక్షల రూపాయలు క్యాష్ ద్వారా బయటకు వెళ్ళవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చారనీ సమాచారం. ఇలా బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఆఫర్ కు మితిలేష్ రెడ్డి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్(Bigg Boss) ఇచ్చిన 15 లక్షల రూపాయల సూట్ కేస్ తో ఈయన హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం.
ఇలా వచ్చిన మూడు రోజులకే మిథిలేష్ రెడ్డి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక నేడు ఎపిసోడ్లో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి సిగ్మా(Sigma) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan)తో పాటు డైరెక్టర్ సంజయ్ (Sanjay)కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరూ హౌస్ లోకి వెళ్లి తమతో పాటు బయటకు వచ్చే కంటెస్టెంట్ కు 5 లక్షల రూపాయల ప్రైస్ మనీ ఆఫర్ చేయగా కంటెస్టెంట్లు ఎవరు ముందుకు రాలేదనీ తెలుస్తోంది.
ఇలా 5 లక్షల రూపాయలతో కంటెస్టెంట్లు బయటకు రావడానికి ఇష్టపడకపోవడంతో బిగ్ బాస్ ఈ అమౌంట్ పెంచుతూ 15 లక్షల వరకు తీసుకువచ్చారు.ఇలా ఆఫర్ ఇవ్వడంతో మిథిలేష్ ఈ ఆఫర్ కు ఓకే చెప్పారట దీంతో సంజయ్, సందీప్ మిథిలేష్ రెడ్డిని 15 లక్షల సూట్కేస్ తో బయటకు తీసుకు వచ్చారని తెలుస్తోంది. అయితే మిథిలేష్ తీసుకున్న ఈ డబ్బు ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందా? అదే జరిగితే విన్నర్ కు ప్రైజ్ మనీ పెద్దగా ఉండదని చెప్పాలి. మరి హౌస్ నుంచి మిథిలేష్ రెడ్డి నిజంగానే బయటకు వచ్చారా? లేదంటే ఈ ఎలిమినేషన్ లో కూడా ఏదైనా ట్విస్ట్ దాగి ఉందా అనేది తెలియాలి అంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి. ఇదే కనుక నిజమైతే మిథిలేష్ రెడ్డి బంపర్ ఆఫర్ కొట్టారని చెప్పాలి. ఈయన హౌస్ లో ఉన్న నాలుగు రోజులకు ఏకంగా 15 లక్షల తీసుకొని బయటకు వెళ్లడం అనేది మామూలు విషయం కాదు.
Also Read: ‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ ఇంటిమేట్ సీన్.. సోషల్ మీడియాలో నిరసన సెగ!