E-Paper
Advertisement

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Chinese Action Movie: కూతురు కనిపించకుండా పోయిందని తెలిసిన క్షణం నుంచి ఓ తండ్రి జీవితం తారుమారు అవుతుంది. ఆమె కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతే… చివరికి తనే స్వయంగా కూతురిని వెతకడానికి బయలుదేరతాడు. కానీ ఆ అన్వేషణలో అడుగడుగునా ప్రమాదకరమైన నేరస్థులు ఎదురైతే ? కూతురి ఆచూకీ కోసం వెతుకుతూ వెళ్లిన తండ్రి ఏకంగా ఓ పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్‌ తో తలపడాల్సి వస్తే ? తండ్రి ప్రేమ, యాక్షన్, క్రైమ్‌తో సాగే కథే ‘ది ఫ్యూరియస్’ (The Furious). మరి కూతురిని కాపాడేందుకు ఆ తండ్రి ఏం చేశాడు ? ఇంతకీ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? అంటే…

కథలోకి వెళ్తే…

వాంగ్ వీ తన కుటుంబంతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటాడు. భార్య, కూతురితో ప్రశాంతంగా ఉండే అతడి జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అతడి కూతురు అకస్మాత్తుగా కిడ్నాప్‌ కు గురవుతుంది. దీంతో ఒక్కసారిగా వాంగ్ వీ కుటుంబం మొత్తం ఆందోళనలో పడుతుంది. కూతురిని ఎవరు తీసుకెళ్లారు ? ఆమెను ఎక్కడికి తరలించారు ? అసలు కిడ్నాప్ వెనుక ఉన్న కారణమేంటి ? అనేది అర్థంకాక సతమతం అవుతారు. వాంగ్ వీ వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాడు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న తీరు అతడికి అసంతృప్తిని కలిగిస్తుంది. కూతురిని కాపాడేందుకు ప్రతి నిమిషం కీలకమని అతడికి తెలుసు.

Advertisement

పోలీసుల కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుందని భావించిన వాంగ్ వీ… స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంటాడు. కూతురి ఆచూకీ కోసం ఆధారాలు వెతుకుతూ వెళ్లే క్రమంలో అతడికి ఓ జర్నలిస్ట్ పరిచయమవుతాడు. ఇద్దరూ కలిసి కిడ్నాప్ వెనుక ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీయడం మొదలు పెడతారు. మొదట ఓ సాధారణ కిడ్నాప్ వ్యవహారంలా కనిపించిన ఈ కేసు వెనుక పెద్ద నేర ప్రపంచం ఉందని క్రమంగా అర్థమవుతుంది. ఆ నెట్‌వర్క్‌ లో ఉన్న ఒక్కో వ్యక్తిని ఎదుర్కొంటూ వాంగ్ వీ ముందుకు వెళ్తాడు. తనకు ఎదురయ్యే ప్రమాదాలను లెక్కచేయకుండా కూతురి కోసం పోరాడుతుంటాడు.

ఈ క్రమంలో అతడి ప్రయాణం సాధారణ తండ్రి అన్వేషణ నుంచి ప్రాణాలకు తెగించి చేసే పోరాటంగా మారుతుంది. శత్రువులు పెరుగుతున్న కొద్దీ అతడి ఆగ్రహం కూడా పెరుగుతుంది. కూతురిని అసలు ఎవరు కిడ్నాప్ చేశారు ? ఆమెను ఎక్కడ దాచారు ? ఈ నేర ముఠా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ? వాంగ్ వీ కూతురిని సురక్షితంగా తీసుకురాగలడా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. యాక్షన్ ఫైట్లు, ఛేజింగ్ సన్నివేశాలు, క్రైమ్ ఎలిమెంట్స్‌తో కథ వేగంగా సాగుతుంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

షీ మియావో, జో టస్లిమ్, యాంగ్ ఎన్‌యూ, యాయన్ రుహియన్, జీజా యానిన్ తదితరులు నటించిన ‘ది ఫ్యూరియస్’ (The Furious)కు కెంజి తనిగాకి (Kenji Tanigaki) దర్శకత్వం వహించారు. ఇది 2026లో వచ్చిన యాక్షన్ క్రైమ్ మూవీ. STARZ అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 26న విడుదలైంది. యాక్షన్ ప్రియులు ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ను డోంట్ మిస్.

Read Also: హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ… షాకింగ్ క్రైమ్ డ్రామా

Tags

Related News

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్

ఒక్క రాత్రి బేబీసిట్టింగ్ అనుకుంటే ఊహించని తలనొప్పి… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

చనిపోయిన వ్యక్తి బాడీకి కాపలాగా వెళ్తే తెల్లారేసరికి శవం మాయం… క్రేజీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

గెలుపు కోసం జరిగే పోటీ కాస్తా ప్రాణాల మీదకు వస్తే ? బ్లడీ స్పోర్ట్స్ హారర్

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×