E-Paper
Advertisement

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ ఇంటిమేట్ సీన్.. సోషల్ మీడియాలో నిరసన సెగ!

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ ఇంటిమేట్ సీన్.. సోషల్ మీడియాలో నిరసన సెగ!
Advertisement

Dorothy Movie: కీర్తి సురేష్ సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో కొన్ని బౌండరీస్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ (Keerthy Suresh) సినిమాలంటే ఆ సినిమాలో ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉండవు అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది కానీ తాజాగా కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోరతీ’ (Dorothy). ఈ సినిమా ఇటీవల తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు నిరసన సెగ తగులుతోంది.

ఇంటిమేట్ సీన్లలో కీర్తి సురేష్..

ఇలా ఈ సినిమా పట్ల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన ఇంటిమేట్ సన్నివేశాలు అని చెప్పాలి. ఊహించని విధంగా కీర్తి సురేష్ ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో LGBTQ ( స్వలింగ సంపర్కం) వంటి సన్నివేశాలు ఉండటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు మగాళ్ళ మధ్య ప్రేమ కథను చూపించడంతో విమర్శలు రావడమే కాకుండా ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి  కీర్తి సురేష్ ఇలాంటి పాత్రలో  నటించడంతో ఆ ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు.

బాయ్ కాట్ చేయాలంటూ నిరసనలు..

Advertisement

ఈ సినిమా 1990 ల కాలంలో మధురై నేపథ్యంలో సాగే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో కుల వ్యవక్ష, హింస పురుషాధిక్యత సమాజం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో రిషికాంత్ ,సనంత్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇలా ఈ ఇద్దరితో కీర్తి సురేష్ ఇంటిమేట్, ముద్దు సన్నివేశాలు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల ద్వారా తమిళ సంస్కృతిని సాంప్రదాయాలను మంట కలుపుతున్నారని వెంటనే ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.

తమిళంలోనూ విడుదల కాబోతున్న డోరతీ..

ఇలా తమిళంలో ఈ సినిమాకు పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ తెలుగులో విడుదల కాబోతుంది ఏపీ తెలంగాణలో స్పిరిట్ మీడియా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తమిళ తమిళంలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉన్న ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

Related News

స్నిగ్ధ చేతిపై టాటూగా స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్.. ఎవరిదంటే?

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!

హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

Big Stories

Advertisement
×