E-Paper
Advertisement

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!
Advertisement

Renudesai: ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అడపాదడపా సినిమాలలో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెగిటివీటిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇటీవల వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా నగర వీధులలో పెద్ద ఎత్తున డీజే శబ్దాలు, అర్ధరాత్రి గణేష్ నిమజ్జనాలపై ఈమె మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే సాయంత్రం ఆరులోపే కార్యక్రమాలు పూర్తి చేస్తాము కానీ మనం ఎంతో భక్తితో కొలిచే గణేష్ నిమజ్జనం మాత్రం అర్ధరాత్రి వరకు ఉంచటం ఏంటి అంటూ ఈమె ప్రశ్నించారు.

దేవుడి ముందు పిచ్చిగంతులు ఏంటీ..

దేవుడి విగ్రహాన్ని ముందు పెట్టుకొని పెద్ద ఎత్తున డీజే శబ్దాలతో అర్ధరాత్రి వరకు డాన్సులు వేయటం ఏ సనాతన ధర్మం చెప్పిందని ఈమె ప్రశ్నించారు దీనివల్ల ఎంతోమంది ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు అంటూ రేణు దేశాయ్ మాట్లాడటంతో ఈమె వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తన గురించి వస్తున్న విమర్శలపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తల్లితండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా..

Advertisement

పిచ్చి బూతులు తిట్టడం దగ్గర నుంచి నేరుగా నా చావును కోరుకునే స్థాయికి అందరూ దిగజారిపోయరు. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో అసభ్యకరమైన కామెంట్లను ఎదుర్కొన్నాను ఇప్పుడు చదువుకున్నామని చెప్పుకునే ఈనాటి సమాజం కూడా నన్ను ముఖం మీద చచ్చిపో అంటూ శాపాలు పెడుతున్నారని ఈమె ఎమోషనల్ అయ్యారు. డీజే శబ్దాల కారణంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగుల తరఫున నిలబడి మాట్లాడినందుకు నాపై ఇలాంటి ట్రోలింగ్ మొదలు పెట్టారని తెలిపారు. ఇలా నాపై విమర్శించే వారికి వీరి తల్లిదండ్రులు ఎలాంటి సంస్కారం నేర్పించారో, ఇంట్లో తోటి మనుషులతో వీరు ఎలా నడుచుకుంటారో ఊహించుకుంటేనే భయం అవుతుందని ఈమె తెలిపారు.

Advertisement

ఇంగ్లీష్ మాట్లాడటం రాయడం మాత్రమే నేర్చుకున్న ఈ ఆధునిక విద్యావంతుల తరానికి నా స్వాగతం అంటూ నేటితరం యువతులపై రేణు దేశాయ్ స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదువుకున్న వారు కూడా ఈమె మాట్లాడిన విషయాలను అర్థం చేసుకోకుండా తనపై బూతులు తిడుతూ సచ్చిపోవాలి అంటూ కామెంట్లు చేయటం సమంజసం కాదని రేణు దేశాయ్ తెలియజేశారు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది రేణు దేశాయ్ కి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×