E-Paper
Advertisement

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్.. వరల్డ్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో తెలుగులో ఇప్పటికి 9 సీజన్లు పూర్తి చేసుకుంది. పదవ సీజన్లో దాదాపు 5 వారాలు పూర్తయ్యాయి. 5 వారాలలో భాగంగా మొత్తం ఆరు మంది ఎలిమినేట్ అయ్యారు. మధ్యలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఇద్దరూ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మళ్ళీ మరో 5 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే హౌస్ మేట్స్ కంటే కూడా వైల్డ్ కార్డ్స్ కి కొన్ని అధికమైన పవర్స్ ఇస్తూ.. గేమ్ ను మరింత హీట్ ఎక్కించారు బిగ్ బాస్. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ చెప్పిన ప్రకారం హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్స్..

వైల్డ్ కార్డ్స్ మొత్తం ఐదు మంది హౌస్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్స్ లో 10 మందికి ఒక్కొక్క ట్యాగ్ తగిలించారు. ఈ ట్యాగ్ చూసిన తర్వాత నిజంగానే వీళ్లకు ఇంత బుర్ర తక్కువ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. వర్షిని – బ్రెయిన్ లెస్, సుధీర్ – నమ్మకం ద్రోహి, ముఖేష్ -డెలులు , అమన్ – స్వార్థపరుడు, దేబ్ జానీ – సేఫ్ ప్లేయర్, రోహిత్ – డ్రామా కింగ్, ఝాన్సీ – వెన్నుపోటు, రాంప్రసాద్ – నక్క బుద్ధి, శాలిని – ఇతరులపై ఫిర్యాదు చేయడం ఇలా కొన్ని ట్యాగ్స్ ఇచ్చారు.

ఆ ఇద్దరే సేఫ్:

Advertisement

ఇకపోతే హౌస్ లో మొత్తం 12 మంది ఉండగా.. అందులో పది మందికి ఒక్కొక్క ట్యాగ్ తగిలించారు. ఇక నరేష్, వంశీకి మాత్రం ఎలాంటి ట్యాగ్ తగిలించలేదు. మొత్తానికి అయితే ఈ ఇద్దరే గేమ్ జెన్యూన్ గా ఆడుతున్నారని వైల్డ్ కార్డ్స్ చెప్పడం గమనార్హం.

నామినేషన్ లో ఆరుగురు..

ఇకపోతే వైల్డ్ కార్డ్స్ హౌస్ మేట్స్ కి ఇచ్చిన ట్యాగ్స్ ను కాస్త పక్కన పెడితే.. ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆరవ వారం 6 మంది నామినేషన్ లోకి వచ్చారు. అందులో ముఖ్యంగా రోహిత్ , శాలిని, వర్షిని, రాంప్రసాద్, వంశీ , అమన్ ఇలా మొత్తం ఆరు మంది నామినేషన్ లోకి వచ్చారు. ఇకపోతే ఈ ఆరుగురిలో అమన్ లేదా శాలిని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ వారం బయటకు వెళ్తారో చూడాలి.

Advertisement

also read:తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

వైల్డ్ ఫైర్ సృష్టిస్తున్న వైల్డ్ కార్డ్స్..

ఇకపోతే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే వైల్డ్ కార్డ్స్ కాస్త హౌస్ లో వైల్డ్ ఫైర్ సృష్టిస్తున్నారని చెప్పాలి . వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన వారిలో శ్వేతా నాయుడు, దక్ష, నీతూ, శివ్, ఆర్కే రామకృష్ణ ఈ ఐదుగురు కూడా తమ స్ట్రాటజీ తో హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం కంటెండర్ షిప్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తూ హౌస్కి కెప్టెన్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ఈ వారం వైల్డ్ కార్డ్స్ లో ఎవరు కెప్టెన్ గా బాధ్యతలు చేపడతారో చూడాలి.

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×