E-Paper
Advertisement

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!
Advertisement

Bigg Boss Prerana:ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సినిమాలతో ముడి పెడుతూ ట్రెండింగ్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది రాజుల కాలం నాటి పద్ధతులలో వివాహం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటే.. ఈమధ్య ఒక బిగ్ బాస్ బ్యూటీ ఏకంగా ఒక మూవీ స్టైల్ లో సీమంతం జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ ప్రేరణ (Prerana). పైగా ప్రముఖ హీరోయిన్ రష్మిక(Rashmika ) స్నేహితురాలు కూడా.. ఈమధ్య అభిమానులకు శుభవార్త చెప్పిన ఈమె ఇప్పుడు ఏకంగా తన స్నేహితురాలి మూవీ స్టైల్ లో సీమంతం జరుపుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.

రణబాలి స్టైల్లో ప్రేరణ సీమంతం..

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), తన స్నేహితురాలు రష్మిక మందన్న (Rashmika mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం రణబాలి (Ranabali). అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో జయమ్మ పాత్ర సాంగ్ ‘ఏందయ్యా స్వామి’ అనే పాటను జోడిస్తూ.. తన భర్తతో కలిసి బేబీ బంప్ చూపిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. తన సీమంతం వేడుకను చాలా గ్రాండ్గా జరుపుకున్నట్టు ఈ విషయాన్ని అభిమానులతో తెలియజేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పైగా ప్రేరణకు రష్మిక ఫ్రెండ్ కావడం, ఈ వేడుకను మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారుతుంది. మొత్తానికి అయితే ప్రేరణ సీమంతం వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

వంశానికి వారసుడిని ఇవ్వబోతున్న జయమ్మ..

ఇక ఇక్కడ మరో సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే.. ఈ వీడియోకి ఆమె స్పెషల్ క్యాప్షన్ జోడించింది. “జయమ్మ తన వంశానికి వారసుడిని ఇవ్వబోతోంది..మరో కొత్త ప్రపంచం సృష్టించబోతోంది” అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే తనకు కొడుకు పుట్టబోతున్నాడు అనే విషయాన్ని ముందుగానే ప్రకటించి అభిమానుల ఎక్సైట్మెంట్ కి కాస్త తెర దించిందనే చెప్పాలి. సాధారణంగా సెలబ్రిటీలు తమకు ఎవరు పుడతారో ముందుగానే తెలిసినప్పటికీ , ఈ విషయాన్ని మాత్రం రిలీజ్ చేయరు. కానీ ప్రేరణ ముందుగానే హింట్ ఇవ్వడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ప్రేరణ, ఆమె భర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే రణబాలి స్టైల్లో తన సీమంతం జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.

ప్రేరణ కెరియర్..

Advertisement

ప్రేరణ విషయానికొస్తే.. ఈమె స్వతహాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. నటి అయ్యే ప్రయత్నాలలోనే రష్మికకు స్నేహితురాలు కూడా.. తర్వాత కాలంలో రష్మిక హీరోయిన్గా మారగా .. ప్రేరణ సీరియల్ హీరోయిన్ గా మారింది. కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రేరణ.. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొనింది. ఫినాలే వరకు వచ్చినప్పటికీ టాప్ ఫోర్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత తన భర్త శ్రీపాద్ తో కలిసి ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించిన ఇస్మార్ట్ జోడి 3 రియాలిటీ షోలో విజేతగా నిలిచింది. ఇక 2023 నవంబర్లో వీళ్ళిద్దరి పెళ్లి జరగగా.. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఇప్పుడు పండంటి మగ బిడ్డకు ఈ జంట జన్మనివ్వబోతోంది.

?utm_source=ig_web_copy_link&cplk=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×