Ravi Shastri On Arshdeep Singh Injury : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టి20 లో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా చిత్తుగా ఓడింది. మూడు బంతులు మిగిలి ఉండగానే అర్షదీప్ సింగ్ గాయం కారణంగా డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అర్షదీప్ సింగ్ గాయం తీవ్రతరం అయితే… బెంగళూరు వేదికగా జరిగే ఐదవ టి20 కోసం భువనేశ్వర్ కుమార్ ను తీసుకోవాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. టీమిండియా బౌలింగ్ దళం పరమ చెత్తగా తయారైందని, ఈ క్రమంలో అర్షదీప్ సింగ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తీసుకు వస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
సిరీస్ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఐదవ టీ20లో భువనేశ్వర్ కుమార్ బరిలో దిగితే టీమిండియా జట్టుకు పాజిటివ్ అవుతుందని రవిశాస్త్రి తెలిపారు. బెంగళూరు గడ్డపై భువనేశ్వర్ కుమార్ కు మంచి ట్రాక్ రికార్డు ఉందని గుర్తు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున చాలా మ్యాచులలో అతడు ఆడి వికెట్లు పడగొట్టాడని వెల్లడించారు. భువనేశ్వర్ కుమార్ కు హోమ్ గ్రౌండ్ లాగా చిన్నస్వామి ఉంటుందని తెలిపారు. వెంటనే బీసీసీఐ దీనిపై ఆలోచించి భువనేశ్వర్ కుమార్ ను న్యూజిలాండ్ తో జరిగే టి20 సిరీస్ కంటే ముందే బరిలోకి దింపాలని కోరారు. దీంతో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన ఉప్పల్ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా భుజానికి తీవ్ర గాయం అయింది. వెస్టిండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ వేగవంతమైన బంతి సంధించాడు. షార్ట్ ఫిచ్ బంతి కావడంతో అర్షదీప్ సింగ్ భుజానికి బలంగా తగిలింది. ఈ సంఘటన 19.3 ఓవర్ సందర్భంగా జరిగింది. అయితే ఈ గాయం అయిన నేపథ్యంలో అర్షదీప్ సింగ్ విలవిలలాడిపోయాడు. అప్పటికే మూడు బంతులలో 25 పరుగులు చేయాల్సిన పరిస్థితి అర్థం చేసుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్…ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేశాడు.
దీంతో 24 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది. అయితే అర్షదీప్ సింగ్ గాయం తీవ్రతరం అయితే… పరిస్థితి ఏంటని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న స్క్వాడ్ లో అర్షదీప్ సింగ్ కంటే మెరుగైన బౌలర్ లేరు. రిజర్వ్ బెంచ్ లో ఫాస్ట్ బౌలర్లు లేకపోవడంతో అర్షదీప్ సింగ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తీసుకురావాలని రవిశాస్త్రి సూచనలు చేశారు. ఐదవ టి20 చాలా కీలకము కాబట్టి కచ్చితంగా అతన్ని తీసుకొస్తే బెటర్ అని తెలిపారు. మరి బీసీసీఐ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.