Ramcharan RC17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్న విషయాన్ని ప్రకటించారు. ఇదివరకు సుకుమార్(Sukumar), రామ్ చరణ్(Ramcharan) కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తరువాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా ప్రకటించిన నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా రామ్ చరణ్ అనారోగ్య సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. రామ్ చరణ్ పెద్ది సినిమా సమయంలో చేతికి గాయం కావడంతో చేతికి సర్జరీ చేయించుకున్నారు తద్వారా సుకుమార్ తో సినిమా ఆలస్యం అయింది. ఇకపోతే నేడు రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వెళ్లడైంది. మాదాపూర్ లో మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి సరికొత్త ఆఫీస్ ఏర్పాటు చేశారు. అయితే ఈ పూజా కార్యక్రమాలు రామ్ చరణ్ సినిమా కోసమేనట్టు చాలామంది భావించారు కానీ ఇది సినిమా పూజా కార్యక్రమం కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా పూజ కార్యక్రమాలు త్వరలోనే ఘనంగా ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఇలా కొత్త ఆఫీస్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సుకుమార్ తన టీం తో కలిసి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసిన చిత్ర బృందం RC 17 ప్రయాణం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ సినిమా కోసం మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సిద్ధంగా ఉండండి అంటూ సుకుమార్ టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాన్ని తెలియచేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
THE MASTERMIND and his DEN for #RC17 are READY🔥
The journey begins with the pooja ceremony soon. Stay tuned for exciting updates ✨
Mega Power Star @AlwaysRamCharan @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/jVIHbH8Mal
— Sukumar Writings (@SukumarWritings) October 14, 2026
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు దసరా పండుగను పురస్కరించుకొని ఘనంగా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా సారా అర్జున్ హీరోయిన్ గా నటించబోతున్నారని తెలుస్తోంది అలాగే ఈ సినిమా కోసం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారని తెలుస్తోంది. ఈ వివరాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. రంగస్థలం సినిమా తర్వాత మరోసారి ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీగా అంచనాలు ఉన్నాయి.
Also Read: ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!