Mangli vs Madhu Priya Bathukamma Songs:తెలంగాణలో బతుకమ్మ పండుగ మొదలైపోయింది .దీంతో ఒక్కసారిగా ఎన్నో బతుకమ్మ పాటలు నెట్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చేశాయి. అయితే వీటిల్లో మధుప్రియ మరియు మంగ్లీ పాడిన బతుకమ్మ పాటలు మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుండటంతో అసలు వీరిద్దరిలో ఎవరిది పై చేయి అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్ అయిపోయింది .
ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి
మంగ్లీ విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంగ్లీకి తెలంగాణ యాస మీద మంచి పట్టు దొరికింది. ఇక తను పాడే విధానం, పలికే యాసతో ఆడియన్స్ కు బాగా దగ్గరయిపోయింది. మంగ్లీ పాడిన పాటల విషయానికి వస్తే ”ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి” అనే బతుకమ్మ పాట ఎంత పెద్ద వైరల్ అయిందో చెప్పక్కర్లేదు .
ఏకంగా 2.4 మిలియన్ల వ్యూస్
ఈ పాట అక్షరాల 12 కోట్ల వ్యూస్ కొల్లగొట్టడం విశేషం. దీంతో బతుకమ్మ పాటలు అంటేనే మంగ్లీ అన్న పేరు వచ్చింది. ఇక తాజాగా మంగ్లీ పాడిన ”సింగిడి సినబోయినది అమ్మను చూసి ఆ రంగులే తడబడినవి బొడ్డేమ్మను చూసి” అనే పాట ఆరు రోజుల్లోనే ఏకంగా 2.4 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.దీంతో బతుకమ్మ పాటలు అంటే కేరాఫ్ మంగ్లీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మంగ్లీ ఫ్యాన్స్ .
మధుప్రియ పేరును కూడా చెప్పుకోవాల్సిందే
మరోవైపు బతుకమ్మ పాటలు అనగానే మధుప్రియ పేరును కూడా చెప్పుకోవాల్సిందే. ఈమె పాడిన బతుకమ్మ పాటలు కూడా యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టాయి. ఇక ఈమె పాడిన ‘రంగురంగుల పోలిగా మారి’ అనే పాట ఏకంగా 62 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ”పొద్దు గూడ బతుకమ్మ” అనే పాట కూడా దాదాపు 12 లక్షల వ్యూస్ ని, అలాగే మరో బతుకమ్మ పాట 14 లక్షల వ్యూస్ కొల్లగొట్టి మంగ్లీ కి గట్టి పోటీని ఇచ్చింది.
ఐదు రోజుల్లో ఏకంగా 1.8 మిలియన్లవ్యూస్
ఇక తాజాగా ఈ సీజన్లో మధుప్రియ పాడిన ”ఆ కోల ఈకోలలే” అనే బతుకమ్మ పాట ఐదు రోజుల్లో ఏకంగా 1.8 మిలియన్లవ్యూస్ ని సొంతం చేసుకొని సత్తా చాటింది. ఒక రకంగా మంగ్లీకి మధుప్రియ గట్టి పోటీని ఇచ్చిందనే చెప్పాలి .
అయితే ఇద్దరిలో ఎవరిది పై చేయి అన్న విషయానికి వస్తే ఇద్దరూ తెలంగాణ యాస, భాషని బాగా వంటబట్టించుకొని అద్భుతంగా పాడే మంచి సింగర్స్ కాబట్టి ఇద్దరిలో ఎవరిది పై చేయి అని కచ్చితంగా చెప్పలేము.
అయితే ఇటు ఫేమ్ పరంగా అటు సినిమాలు,మరో వైపు షోస్ వంటి వాటితో పోలిస్తే మధుప్రియ కన్నా మంగ్లీ కాస్త ముందు ఉందని చెప్పుకోవాలి. చూడాలి మరి ముందు ముందు వీరిద్దరి నుంచి వచ్చే పాటలు మరిన్ని సంచలనాలు సృష్టిస్తాయో !
ALSO READ :సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?